పడుకునే ముందు.. పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలో తెలుసా..?

First Published | Aug 8, 2024, 11:02 AM IST

వారు రాత్రి పడుకోబోయే ముందు.. కచ్చితంగా కొన్ని మాటలు వారికి చెప్పాలట. మరి ఎలాంటి మాటలు వింటే.. పిల్లల జీవితం సంతోషంగా, ఎలాంటి భయాలు లేకుండా సాగుతుందో తెలుసుకుందాం..

పిల్లలు సంతోషంగా ఉండాలని, వారు ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్క పేరెంట్స్ కోరుకుంటారు. వారు కోరుకున్నది అన్నీ వారికి దక్కాలని అనుకుంటారు. అడిగిందల్లా కొనిపెట్టేస్తూ ఉంటాం. అయితే.. పిల్లల సంతోషం వారు అడిగినవి కొని ఇవ్వడమే కాదు.. వారికి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. అది కూడా.. వారు రాత్రి పడుకోబోయే ముందు.. కచ్చితంగా కొన్ని మాటలు వారికి చెప్పాలట. మరి ఎలాంటి మాటలు వింటే.. పిల్లల జీవితం సంతోషంగా, ఎలాంటి భయాలు లేకుండా సాగుతుందో తెలుసుకుందాం..
 

Parents


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలనే ప్రేమిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఆ విషయం వారికి కనీసం అప్పుడప్పుడు అయినా చెప్పాలట. అది కూడా వారిని నిద్రపుచ్చేముందు ప్రేమగా దగ్గరకు తీసుకొని.. మాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాలి. ఆ మాట పిల్లలకు భద్రత ఇవ్వడంతో పాటు..ప్రేమ పెరగడానికి సహాయపడుతుంది.
 

Latest Videos


Parents

రోజంతా అల్లరి చేసే పిల్లలు అయినా రోజులో ఏదో ఒకటి మీరు చెప్పిన పని చేయడం, ఏదైనా మంచి పని చేయడం చేస్తూ ఉంటారు. అలాంటివి వారికి గుర్తు చేసి.. నువ్వు ఆ పని చేసినందుకు నేను చాలా గర్వపడ్డాను అనే మాట చెప్పాలి. ఆ మాట చెప్పడం వల్ల.. పిల్లలకు సంతోషం కలిగది.. అలాంటి మంచి పనులు మరిన్ని చేయడానికి ఇష్టపడతారు.

Parenting Tips-


కొంచెం పిల్లలు పెద్దవారు అవుతున్నప్పుడు.. వారికంటూ కొన్ని డ్రీమ్స్  ఉంటాయి. అవి జరుగుతాయో లేదో అని.. వారు భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారికి మీరు ధైర్యం ఇవ్వాలి. మీరు కోరుకున్నవన్నీ నిజమౌతాయని చెప్పాలి.  ఆ ప్రోత్సాహం వారికి భవిష్యతుకు బాగా సహాయపడుతుంది.

parent's day

ఏమైనా కష్టంగా అనిపిస్తే నాకు చెప్పు. ఈ మాట చాలా చిన్నదే కానీ.. వారి పై ఎక్కువ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.  ఈ చిన్న మాట వారిలో ఎంతో ధైర్యం పెంచుతుంది. 

Parenting Tips-

ఏదైనా బ్యాడ్ జరిగిని.. పిల్లలు బాధపడినా, రేపు మళ్లీ అలా ఉండదని.. రేపు ఇంకా బాగుంటుందని వారికి చెప్పాలి. అప్పుడు వాళ్లు ఆ బాధను మర్చిపోయే అవకాశం ఉంటుంది. 

పిల్లలు తాము అందంగా లేమని, తమకు అది రాదు.. ఇది రాదు అని బాధపడుతూ ఉంటారు. ఈ విషయంలోనూ మీరు ధైర్యం చెప్పాలి. నువ్వు చాలా బాగుంటావని, నీ వల్ల అవుతుందని.. నువ్వు ఏదైనా చేయగలవు అని కూడా చెప్పాలి.


నిద్రలో చెడు కలలు రాకుండా ఉండేందుకు... నీకు మంచి కలలు వస్తాయి అని కూడా చెప్పాలి. ఇలాంటి మాటలు పడుకునే ముందు చెప్పడం వల్ల  వారు పాజిటివ్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది.
 

click me!