parents
ప్రతి పేరెంట్స్ ... తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తిత్వంతో ఉండాలని, నీతి నియమాలు ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటాం. దాని కోసం తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. చాలా మంది పేరెంట్స్ చేసే మొదటి పొరపాటు ఏంటంటే.. పిల్లలను క్రమ శిక్షణగా ఉంచే క్రమంలో, పిల్లలను మందలించే సమయంలో.. వారిని తిడుతూ ఉంటారు. సాధారణంగా కోప్పడితే పర్లేదు కానీ చెడు పదాలు వాడుతూ తిట్టేస్తూ ఉంటారు. కానీ.. ఆ పదాలు పిల్లలపై చెడు ప్ర భావం చూపుతుంది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడూ చెప్పకూడని మాటలు ఇక్కడ ఉన్నాయి.
స్టుపిడ్: చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మాటలు చాలా సులభంగా చెబుతారు. కానీ, ఈ పదం మీ బిడ్డను త్వరగా నిరుత్సాహపరుస్తుంది. వారి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి పొరపాటున కూడా మీ పిల్లలతో ఈ మాట చెప్పకండి. ఇదే కాదు.. బుద్ధి లేదా..? బ్రెయిన్ పని చేయదా ఇలాంటివి కూడా వాడకూడదు.
ఇతరులతో పోల్చడం: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోలుస్తారు కానీ ఇది తప్పు. మీరు మీ పిల్లలతో ఇలా చెప్పే మాటలు వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రత్యేకించి మీరు దీన్ని పదే పదే చెబుతున్నప్పుడు, నేను నిజంగా ఉత్తముడిని కాదని వారు నమ్ముతారు. అంతే కాకుండా, మీ పిల్లల ఆత్మవిశ్వాసం క్షీణిస్తూనే ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా మీ బిడ్డను ఇతరులతో పోల్చకండి.
నీ వల్ల ఉపయోగం లేదు: పిల్లలు పెద్దయ్యాక కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో వాళ్లు సరైన పని చేయకుంటే, మీ వల్ల ఉపయోగం లేదు అని తల్లిదండ్రులు వెంటనే తిట్టారు. అయితే అలాంటి మాటలు పిల్లలతో చెప్పకండి. ఇలా చెప్పడం మీకు అలవాటు అయితే వెంటనే ఆపండి. ఇది మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది.
Parenting Tips
తిట్టడం లేదా చెడు పదాలు ఉపయోగించడం: మీ పిల్లలకు ఇలా చేయకండి. ఈ అలవాటును వెంటనే మానేయండి. మీరు మీ పిల్లలతో ఇలా ప్రవర్తిస్తే, వారు తీవ్రంగా కలత చెందుతారు.తప్పు మార్గాల్లోకి వెళ్లవచ్చు.