మీ పిల్లలు హైట్ పెరగడం లేదా? ఈ రోజు నుంచే వీటిని తినిపించండి

First Published Dec 24, 2023, 2:56 PM IST

పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా చాలా ముఖ్యం. సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం వల్ల పిల్లలు ఎత్తు పెరగరు. పిల్లలు హైట్ పెరగాలంటే  వారి ఆహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఎన్నో రకాల విటమిన్లు ఉండాలి. మరి పిల్లల ఎత్తును పెంచడానికి ఏ ఆహారాలు తినిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

kids eating

పిల్లలందరూ ఒకేలా ఎత్తు పెరగరు. కొంతమంది పిల్లలు ఏజ్ కు తగ్గట్టు ఎత్తు పెరిగితే మరికొంతమంది పిల్లలు తక్కువ లేదా ఎక్కువ ఉంటారు. కానీ పిల్లలు ఎత్తు పెరగకపోవడం వల్ల తల్లులు ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే తల్లి మాత్రమే తన పిల్లల అలవాట్లను బాగా అర్థం చేసుకోగలదు. అలాగే వారికి అవసరమైన పోషణ అందిస్తుంది. 

kids eating


అందరు పిల్లలు ఒకేరకమైన ఆహారాలను తినడానికి ఇష్టపడకపోవచ్చు. కొంతమంది పిల్లలు హెల్తీ ఫుడ్ ను తింటే మరికొంతమంది పిల్లలు జంక్ ఫుడ్ ను ఇష్టంగా తింటుంటారు. కానీ అనారోగ్యకరమైన ఆహారం వారి ఆరోగ్యానికి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అందుకే మీ పిల్లలకు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినిపించడం మంచిది. అలాగే వారి ఆహారంలో పోషకమైన పండ్లను చేర్చడం మంచిది. వీటిని తింటే పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు. పిల్లలు హైట్ పెరగడానికి ఏం తినిపించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

almond milk

బాదం పాలు

పోషకాలు ఎక్కువగా ఉండే బాదం పాలు పిల్లల ఎత్తును పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం రాత్రిపూట బాదం పప్పులను నానబెట్టి, మరుసటి రోజు ఒక గ్లాసు పాలతో కలిపి పిల్లలకు తినిపించాలి. బాదంలో ఉండే అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, మాంగనీస్, ఆరోగ్యకరమైన కొవ్వు,  ఫైబర్ పిల్లలకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి.
 

పెరుగు

కాల్షియం ఎక్కువగా ఉండే తాజా పెరుగు పిల్లల ఎముకల అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. అందుకే మీ పిల్లలు పెరుగు తినేలా చూడండి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ డి, ప్రోబయోటిక్స్ కూడా పిల్లల ఎముకలను లోపలి నుంచి బలంగా చేస్తాయి. 

పాలకూర-టమోటా సూప్

పాలకూర-టమోటా సూప్ ను పిల్లలకు నిరంతరం తినిపిస్తే పిల్లల ఎత్తు పెరుగుతుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ సూప్ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగ్గా ఉంటుంది. 
 

నానబెట్టిన శనగలు, బెల్లం

నానబెట్టిన శనగలు, బెల్లాన్ని ఉదయాన్నే పిల్లలకు తినిపించడం వల్ల వారి ఎత్తు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే చిక్పీస్ ప్రోటీన్, ఇనుము, విటమిన్ బి కి మంచి మూలం. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే బెల్లం కూడా పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

గుడ్లు, చేపలు

మీ పిల్లలు మాంసాహారులైతే వారికి గుడ్లు, చేపలను తినిపించండి. ప్రోటీన్, బయోటిన్, ఐరన్ ఎక్కువగా ఉండే ఈ పదార్థాలు పిల్లల ఎత్తును పెంచడానికి సహాయపడతాయి.
 

click me!