ఆడవారి నడుము సైజుకు, పిల్లలు కలగకపోవడానికి సంబంధమేంటి?

First Published | Dec 23, 2023, 11:23 AM IST

ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీనికి నడుము చుట్టుకొలతకు సంబంధం ఉందని ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అసలు నడుము సైజు ఎంత ఉంటే ప్రాబ్లమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వంధ్యత్వం అనేది 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువకాలం క్రమం తప్పకుండా సురక్షిత శృంగారంలో పాల్గొన్నా.. గర్భందాల్చకపోవడం. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు. దీని వల్ల ప్రజలు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. సంతానలేమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, తాజా అధ్యయనం.. దీనికి ఒక షాకింగ్ కారణాన్ని వెల్లడించింది.

పీఎల్ఓఎస్ వన్ లో ఒక అధ్యయనం ప్రకారం.. నడుము పరిమాణం మహిళల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల 3,239 మంది మహిళల డేటాను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ఇందులో 11.1 శాతం వంధ్యత్వం సమస్యను కలిగి ఉన్నారు. అలాగే నడుము పరిమాణంలో ఒక సెంటీమీటర్ పెరుగుదల వంధ్యత్వ ప్రమాదాన్ని 3 శాతం పెంచిందని పరిశోధకులు కనుగొన్నారు. వంధ్యత్వానికి ఎక్కువ ప్రమాదం ఉన్న మహిళలకు అధిక రక్తపోటు, డయాబెటిస్ సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే వీరికి బిఎమ్ఐ ఎక్కువగా ఉన్నాయి.
 


infertility

స్థూలకాయానికి, సంతానలేమికి మధ్య కచ్చితమైన సంబంధం ఉందని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది.అందుకే బరును నియంత్రించడం చాలా ముఖ్యం. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి మీ రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం పదండి. 

శారీరక శ్రమ

నిశ్చల జీవనశైలే స్థూలకాయానికి ప్రధాన కారణం. ఒకే చోట కూర్చోవడం వల్ల బరువు పెరిగి నడుము చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోతుంది. అందుకే రోజూ కాసేపు వ్యాయామం చేయండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీ శరీర కొవ్వును కరిగిస్తుంది. అలాగే మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.
 

హెల్తీ డైట్

మీ రోజువారి ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిని చేర్చండి.  ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం మీ బరువు పెరగకుండా సహాయపడుతుంది. 
 

మంచి నిద్ర

నిద్రలేమి కూడా ఊబకాయానికి దారితీస్తుందన్న సంగతి మీకు తెలుసా? అందుకే ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

stress

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి కారణంగా మన శరీరం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ను విడుదల చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒత్తిడి కారణంగా మీరు బరువు పెరిగే ప్రమాదం ఉంది. 

Latest Videos

click me!