గర్భిణులు నువ్వులు తినొద్దా? ఒకవేళ తింటే?

First Published | Dec 24, 2023, 1:15 PM IST

నువ్వులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే గర్భిణులు వీటిని తినొచ్చా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 

Image: Getty

ప్రెగ్నెన్సీ టైంలో బొప్పాయి, పైనాపిల్, నువ్వులతో చేసిన ఆహారాలు తినకూడదని పెద్దలు చెప్తుంటారు. అన్నింటికీ మించి.. నువ్వులు తినడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. 

Teenage pregnancy

గర్భిణీ స్త్రీలు నువ్వులను ఎందుకు తినకూడదు?

గర్భిణులు నువ్వులతో చేసిన ఆహారాలను తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే నువ్వుల్లో వేడి చేసే గుణముంటుంది. వీటిని లిమిట్ లో తినడమే మంచిది. వీటిని గర్భిణులు తరచూ తింటే గర్భాశయాన్ని ఉత్తేజితం చేస్తాయి. అందుకే గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు నువ్వులకు దూరంగా ఉండాలి.
 


గర్భిణీ స్త్రీలు ఏ నువ్వులు తినకూడదు?

నువ్వులు నలుపు, తెలుపు రకాల్లో  ఉంటాయి. గర్భిణులు తెల్ల నువ్వులను తినడం సురక్షితం కాదని నమ్ముతారు. ఇది అపోహేనని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో షోషకాలను అందిస్తుందని నమ్ముతారు. కానీ మొదటి మూడు నెలలు నువ్వులకు దూరంగా ఉండటమే మంచిది. అయితే ఇది ఆరోగ్యకరమైన ఆహారం. కాబట్టి వీటిని తిన్నా లిమిట్ లోనే తినాలి. 
 

Black Sesame Seeds

నువ్వుల పోషణ 

నువ్వుల్లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలను పొందాలంటే కొన్ని నువ్వులను మాత్రమే తీసుకోవాలి.

గర్భధారణ సమయంలో మీరు నువ్వులను ఎంత పరిమాణంలో తీసుకోవాలి? 

ప్రెగ్నెన్సీ సమయంలో నువ్వులు తినొచ్చని చెప్పినా.. వీటికి దూరంగా ఉండటమే సేఫ్. ఎందుకంటే వీటిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొదటి 3 నెలలు నువ్వులతో చేసిన ఆహారాలను పూర్తిగా మానుకోండి. అయితే దీన్ని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే దీనివల్ల ఎన్నో సమస్యలు రావొచ్చు. 
 

నువ్వులు గర్భస్రావానికి కారణమవుతాయా?

పీరియడ్స్ తొందరగా రావడానికి నువ్వులను తినొచ్చు. అవును నెలసరి వేగవంతం కావడానికి నువ్వులు సహాయపడతాయి. కానీ గర్భిణీ స్త్రీలు వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అవి మీ శరీరంలో ఎక్కువ వేడిని సృష్టిస్తాయి. అతిగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇవి పిండం అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయి.
 

Latest Videos

click me!