చాలా మంది పిల్లలు స్కూల్ హడావుడిలో పడి బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు చేయరు. కానీ ఉదయం తినకపోవడం వల్ల వారి ఆరోగ్యం పాడవుతుంది. అలాగే స్కూల్ లో ఏం చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇది వారి చదువును డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మంచి పోషకాహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో పెట్టండి. ఇది వారి మెదడును షార్ప్ గా ఉంచుతుంది. పిల్లల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే పిల్లలు ఉదయాన్నే ఒక స్ఫూర్తిదాయకమైన కథను వినడం కూడా మంచిదే. ఇది వారి ఎదుగుదలకు సహాయపడుతుంది.
అన్నింటిని సిద్దం చేసుకోవడం
చాలా మంది పేరెంట్స్ పిల్లలు స్కూల్ కు వెళ్లడానికి అవసరమైన యూనిఫాం, బుక్స్, బ్యాగ్, మధ్యాహ్న భోజనం అంటూ అన్నింటినీ పిల్లలకే తీసుకెళ్తారు. కానీ దీనివల్ల మీ పిల్లలు సోమరిగా అవుతారు. కాబట్టి వారికి సంబంధించిన వాటిని వారే ఏర్పాటు చేసుకునేలా నేర్పండి. ఉదయం బుక్స్ సర్దుకోవడం, స్కూల్ యూనిఫాం ను తీసుకోవడం, బ్రేక్ ఫాస్ట్ తినడం వంటివి నేర్పండి. ఇవి చిన్న చిన్న విషయాలే అయినా మీ పిల్లల్ని స్మార్ట్ గా తయారుచేస్తాయి.