Child Psychology: పిల్లల్ని ఎప్పుడూ తిడుతూ, కొడుతూ ఉంటే వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?

Published : Jan 09, 2026, 05:14 PM IST

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో చాలా కఠినంగా ఉంటారు. వారిని ఎప్పుడూ తిట్టడం, కొట్టడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారు. కానీ పేరెంట్స్ ఇలా చేయడం వల్ల పిల్లల మైండ్‌సెట్ ఎలా మారుతుందో తెలుసా?

PREV
15
Children Psychology

చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి వారిని కొట్టడం, తిట్టడం వంటివి చేస్తుంటారు. అయితే, సైకాలజీ నిపుణుల ప్రకారం.. ఇలాంటి కఠినమైన శిక్ష.. పిల్లల మానసిక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధిపై దుష్ప్రభావాలు చూపుతుంది. చిన్నతనంలో ఎదురయ్యే భయానక అనుభవాలు, శారీరక శిక్షలు, అసహ్యం, ఎప్పుడూ తిట్లుపడటం వంటి పరిస్థితులు.. పిల్లలలో ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

25
ఎప్పుడూ తిట్లుపడే పిల్లలు ఎలా ఉంటారంటే?

పిల్లలను ఎప్పుడూ తిట్టడం వల్ల, వారు భయం, అనిశ్చితి మైండ్‌సెట్ లో పెరుగుతారు. వారు తప్పులు చేయకుండా ఉంటారు. కానీ వారిలో ఒకరకమైన భయం మాత్రం మొదలవుతుంది. ఇది మొదట్లో పేరంట్స్ కి సానుకూలంగా కనిపించినా.. రాను రాను పిల్లల్లో సృజనాత్మకత, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను స్వతహాగా పరిష్కరించడం వంటి లక్షణాలను హరించవచ్చు.

నిపుణుల ప్రకారం ఎప్పుడూ తిట్లుపడే పిల్లలు.. తమ భావాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడుతారు. అలాగే స్నేహ సంబంధాల్లో వెనుకబడటం, సామాజిక ఇంటరాక్షన్ లో సమస్యలు ఎదుర్కోవడం వంటివి జరగుతుంటాయి.

35
పిల్లల ఆత్మగౌరవం

నిజానికి ఇలాంటి పరిస్థితులు పిల్లల ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. ఎప్పుడూ తిట్టడం, శిక్షించడం ద్వారా, తల్లిదండ్రులు అనుకోకుండా పిల్లల మనసులో “నేను కరెక్ట్ కాదనే” భావనను సృష్టిస్తారు. ఇది వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. దానివల్ల బాధ్యతలను నిర్వహించడంలో, సమస్యలను తెలివిగా పరిష్కరించడంలో వారు వెనుకబడతారు.

45
కోపం, అసహనం

సైకాలజీ నిపుణుల ప్రకారం కఠిన శిక్షలను.. ప్రేమ, సూచనలతో కలిపి సమతుల్యం చేయడం ముఖ్యం. మానసికంగా మద్ధతు, సానుకూల స్పందన, చిన్న తప్పులకు సూచనలు ఇవ్వడం, పిల్లల్లో మంచి నైపుణ్యాలను పెంచుతుంది. ఎప్పుడూ కొట్టడం, తిట్టడం వల్ల భవిష్యత్తులో వారిలో చిరాకు, కోపం, అసహనం వంటివి పెరుగుతాయి. 

55
తప్పుల నుంచి నేర్చుకునే విధంగా..

పిల్లలకు వేసే శిక్ష ఎప్పుడూ కఠినంగా కాకుండా వాళ్ల తప్పుల నుంచి ఒప్పులు నేర్చుకునే విధంగా ఉండాలి. దానివల్ల వారు సమస్యలను తెలివిగా పరిష్కరించడం, సానుకూలంగా స్పందించడం నేర్చుకుంటారని సైకాలజీ విశ్లేషణలు చెబుతున్నాయి.

నిపుణుల ప్రకారం పిల్లలను తిట్టడం, కొట్టడం, భయపెట్టడం వంటి వాటివల్ల తాత్కాలిక నియంత్రణను సాధించినా.. పెద్దయ్యే కొద్దీ వారి ఆత్మవిశ్వాసం, క్రియేటివిటి, భావోద్వేగ స్థిరత్వం, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినవచ్చు. కాబట్టి సరైన హద్దులు, పాజిటివ్ ఆలోచనలు, సానుకూల సూచనలు, ప్రేమతో కూడిన గైడెన్స్ అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories