Parenting Tips: కొంతమంది పిల్లలు చదివింది చాలా రోజుల వరకు గుర్తుంచుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఎన్ని సార్లు చదివినా అప్పుడే మర్చిపోతుంటారు. ఇది తల్లిదండ్రులను కలవరపెడుతుంది.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని కోరకుంటారు. కొంతమంది పిల్లలు చదివిన విషయాన్ని ఎన్నిరోజులైనా గుర్తుంచుకుంటే మరికొంతమంది పిల్లలు మాత్రం ఎంత చదివినా అప్పుడే మర్చిపోతుంటారు. దీనివల్లే పిల్లలకు పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తాయి.
28
మెమోరీ పవర్
పిల్లలు ఇలా మర్చిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో నిద్రలేమి, పోషకాహార లోపం ఉన్నాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల మెమోరీ పవర్ ను ఎలా పెంచాలో తెలియదు. కానీ తిడుతుంటారు.కానీ తిట్టినంత మాత్రానా పిల్లలకు చదివింది గుర్తుండదు. అందుకే పిల్లల మెమోరీ పవర్ ను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
38
నిద్ర
పిల్లల జ్ఞాపకశక్తి ని పెంచడానికి కంటినిండా నిద్ర ఉండాలి. సరిగ్గా నిద్రపోయే పిల్లల మెమోరీ పవర్ బాగుంటుంది. సరిగ్గా నిద్రపోతే వారి మెదడు నిన్న చదివిన దాన్ని కూడా గుర్తుకు తెస్తుంది. 3 నుంచి 5 ఏండ్ల పిల్లలు పగలు కూడా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పిల్లలు నిద్రపోయే ముందు టీవీ, ఫోన్ ను చూడనివ్వకూడదు. అలాగే పిల్లలు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. పిల్లల నిద్రగంటలు వయసును బట్టి మారుతాయి.
పిల్లలుకూడా ఏరోబిక్ వ్యాయామం చేయొచ్చు. ఇది వారు నేర్చుకునే దాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ గంట పాటు సైకిల్రో తొక్కడం, ఈత కొట్టడం వంటి వ్యాయామాలు చేస్తే మెమోరీ పవర్ బాగుంటుంది. పిల్లలు హోం వర్క్ చేయడానికి ముందు ఒక 10 నుంచి 15 నిమిషాలు జంపింగ్ చేయడం, గుంజీలు తీయడం వంటివి చేసినా మంచిదే.
58
జ్ఞాపకశక్తి
పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి క్విజ్ పోటీలు కూడా బాగా ఉపయోగపడతాయి. వారి మెమోరీ పవర్ ను తెలుసుకోవడానికి మీరు ప్రశ్నలు అడగండి. ఇది వారి మెదడును చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. వారు చదివిన దాన్నుంచి క్వచ్చన్స్ అడగండి. తర్వాత రోజు కూడా వారు చదివిన టాపిక్ నుంచే ప్రశ్నలు అడగండి.
68
ఇలా చదివించండి
కష్టమైన లెసెన్స్ ను ఒకేరోజు మొత్తం చదివించొచ్చు. రెండు మూడు రోజులు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చదివించండి. దీనివల్ల వారికి కష్టంగా అనిపించదు. అలాగే చదివిన విషయాలు కూడా గుర్తుంటాయి.
78
బొమ్మలు
పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే వారు చదివిన పదాలను బొమ్మలుగా గీయించండి. దీనివల్ల బాగా గుర్తుంటుంది. డూడుల్ వంటి బొమ్మల ద్వారా బోధించండి. రాసిన పదాల కన్నా గీసిన బొమ్మలే పిల్లలకు ఎక్కువగా గుర్తుంటాయి.
88
ఉదయం ఇవి పెట్టండి
మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్, ప్రోటీన్లు ఉన్న ఆహారాలను బాగా పెట్టండి. ఇవి పిల్లల ఏకాగ్రతను పెంచుతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. గుడ్లు, తృణధాన్యాల దోశ, పండ్లను పెట్టండి. మర్చిపోకుండా ఇంటి నుంచే వాటర్ బాటిల్ ను ఇవ్వండి.