Parenting Tips: పిల్లలకు చదువు కంటే ముఖ్యంగా నేర్పాల్సినవి ఇవే..!

Published : May 28, 2025, 01:37 PM IST

తరగతి గది పాఠాల ఎన్ని ఉన్నా.. ఎన్ని మార్కులు వచ్చినా అవి జీవితాన్ని నేర్పకపోవచ్చు. జీవితంలో ఎదురయ్యే కొన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి అంటే కచ్చితంగా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి.

PREV
17
పేరెంటింగ్ టిప్స్..

పిల్లలకు మూడేళ్లు రాగానే ప్రతి పేరెంట్స్ స్కూల్లో చేర్పించాలి అని అనుకుంటారు. పిల్లలకు విద్య చాలా ముఖ్యం కాబట్టి.. స్కూల్లో చేర్పించడం చాలా అవసరం. అయితే.. స్కూల్లో నేర్పించే చదువు కంటే చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అవే లైఫ్ స్కిల్స్.. వీటిని స్కూల్లో నేర్పించరు. మనం, మన పిల్లలకు ఇంట్లోనే నేర్పాలి. మరి, అవేంటి..? వాటిని పిల్లలకు ఎలా నేర్పించాలి అనే విషయం చూద్దాం...

27
పిల్లలకు నేర్పాల్సిన లైఫ్ స్కిల్స్ ఇవి...

తరగతి గది పాఠాల ఎన్ని ఉన్నా.. ఎన్ని మార్కులు వచ్చినా అవి జీవితాన్ని నేర్పకపోవచ్చు. జీవితంలో ఎదురయ్యే కొన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి అంటే కచ్చితంగా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఏవి నేర్పితే.. పిల్లల భవిష్యత్తు బాగుంటుందో తెలుసుకుందామా..

37
1. సమయపాలన..

చాలా మంది పిల్లలు ఉదయాన్నే సమయానికి లేవరు.పేరెంట్స్ చెప్పినా లేవడానికి ఇష్టపడరు. కానీ వారంతట వారే నిద్ర లేచి.. పిల్లలు సమయానికి నిద్ర లేవడం నేర్చుకోవాలి. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు.. ఇది పిల్లల్లో జవాబుదారీతనం, సమయం పాలన, ఇతరుల సమయాన్ని గౌరవించడం లాంటి విలువలు పెరుగుతాయి.ఇది వీరికి జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

47
2. అనుకున్నట్టు జరగకపోయినా ప్రశాంతంగా ఉండడం

లైఫ్ లో ఓడిపోవడం సహజం. కానీ, ఓడిపోయామని బాధపడటం, భయపడటం, కోప్పడటం లాంటివి లేకుండా ప్రశాంతంగా ఉండటం కూడా పిల్లలు నేర్చుకోవాలి. కానీ కోపంగా కాకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

57
3. బిగ్గరగా కాదు, స్పష్టంగా మాట్లాడడం

స్నేహితులను సంపాదించాలన్నా, అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్నా, స్పష్టంగా, గౌరవంగా మాట్లాడడం అవసరం. నమ్మకంగా మాట్లాడటం సంబంధాలను మెరుగుపరుస్తుంది. గట్టి గట్టిగా అరవడం వల్ల ఏ లాభం ఉండదు.

4. వంట చేయడం..

అద్భుతంగా వంట చేయడం రాకపోయినా.. కనీసం మూడు పూటలా మనకు మనం తినేలాగా అయినా వంట చేయడం ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వంట చేయడం వస్తే ఎక్కడైనా బతకగలుగుతారు. అంతేకాదు.. బడ్జెట్ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన పెరుగుతుంది.

67
5. సంబంధాలను కాపాడుకోవడం...

ఎవరితో అయినా గొడవ పడటం, బంధాలను తెంచుకోవడం చాలా సులువు. కానీ.. అదే అందరితో గౌరంగా ఉంటూ.. బంధాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇది మనం పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి.

6. చిన్నగా ప్రారంభించి, పూర్తి చేయడం

ఏదైనా అభిరుచి అయినా, చిన్న ప్రాజెక్ట్ అయినా, ప్రారంభించిన దాన్ని పూర్తి చేయడం ధైర్యాన్ని, నిబద్ధతను పెంచుతుంది. ఇది ప్రతిభ కంటే ఎక్కువ విలువైనది. మధ్యలో ఆపేసే అలవాటు ఉండకూడదు.

77
7. ప్రశంస కోసం కాకుండా బాధ్యతతో పని చేయడం

ఎవరూ చూడకపోయినా కష్టపడటం నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఇటువంటి నిశ్శబ్ద కృషే భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంది. ఎవరో మనల్ని ప్రశంసిస్తారని, ఆ ప్రశంసల కోసం ఎప్పుడూ పని చేయకూడదు.

8. తమ విలువలను తెలుసుకోవడం

ఇది కేవలం మతం గానీ రాజకీయాలు గానీ కాదు. ఎవరు, ఏది నమ్ముతారో తెలుసుకోవడం—ముఖ్యంగా ఏ విషయంలో రాజీ పడకూడదో గ్రహించడం..వారు జీవితంలో స్థిరంగా ముందుకు సాగేందుకు దోహదపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories