మీ పిల్లల చేతిరాత బాగాలేదా? ఇలా చేయండి అక్షరాలను అందంగా రాస్తారు

Published : Sep 24, 2025, 03:43 PM IST

చదువులో ముందుంటే సరిపోదు పిల్లల చేతిరాత కూడా బాగుండాలి. అప్పుడే పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. అయితే కొంతమంది పిల్లలు చదివినా చేతిరాత మాత్రం సరిగ్గా రాయలేకపోతుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే?

PREV
15
చేతిరాత

కొంతమంది బాగా చదివినా అక్షరాలను మాత్రం అర్థమయ్యేట్టు రాయలేకపోతుంటారు. కానీ చేతిరాత సరిగ్గా లేకపోతే మాత్రం మీరెంత చదివినా మార్కులు మాత్రం సరిగ్గా రావు. నిజానికి అందమైన చేతిరాత మన వ్యక్తిత్వాన్ని కూడా తెలుపుతుందంటారు. అయితే కొంతమంది పుస్తకాల్లో మాదిరిగా అక్షరాలను అందంగా రాస్తుంటారు. 

మరికొంతమంది ఎంత ట్రైచేసినా ఏదో రాసామా? అన్నట్టు రాస్తుంటారు. కొంతమంది రాసే అక్షరాలైతే ఎవరికీ అర్థం కావు కూడా. అయితే ఇలాంటి వారు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ కొన్ని టెక్నిక్స్ ను ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా చేతి రాత మెరుగుపడుతుంది. అందుకే పిల్లల చేతిరాతను మెరుగుపర్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
సరైన కాగితం, పెన్ను

ఒక్కొక్కరూ ఒక్కోలా పెన్నును పట్టుకుంటారు. రాస్తుంటారు. అందుకే మీకు కంఫర్ట్ గా ఉండే పెన్ను ను సెలక్ట్ చేసుకోవాలి. అలాగే పేపర్ కూడా పెన్నుకు సరిపోయేలా ఉండాలి. దీనివల్ల కూడా మీ చేతిరాత మెరుగుపడుతుంది.

35
ఈ భంగిమలో కూర్చోండి

చాలా మంది ఎలా పడితే అలా కూర్చొని రాస్తుంటారు. కానీ చేతిరాత బాగుండాలంటే రాసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండాలి. టేబుల్ పై కూర్చున్నప్పుడు పాదాలను నేలపై ఉంచాలి. తప్పుడు పొజీషన్ లో కూర్చుంటే తొందరగా అలసిపోతారు. అలాగే అక్షరాలను సరిగ్గా రాయలేరు. దీంతో చేతిరాత సరిగ్గా ఉండదు. 

అలాగే మీరు రాసే అక్షరాల సైజును కూడా ఒకేలా ఉంచాలి. అంటే కొన్ని అక్షరాలను చిన్నగా, మరికొన్నింటిని పెద్దగా రాయడం లాంటివి చేయకూడదు. అన్నింటినీ ఒకేసైజులో రాసినప్పుడే చేతిరాత అందంగా ఉంటుంది.

45
రోజూ ప్రాక్టీస్ అవసరం

మీ పిల్లల చేతిరాత మెరుగుపడాలంటే మాత్రం ఏ ఒక్కరోజో ప్రాక్టీస్ చేసి వదిలేయకూడదు. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ప్రాక్టీస్ చేస్తే చేతిరాత మెరుగుపడుతుంది. ట్రేసింగ్ షీట్లు, కాపీబుక్స్ వంటి వాటిని రాస్తూ హ్యాండ్ రైటింగ్ ను ప్రాక్టీస్ చేసినా మారుతుంది. 

అలాగే స్టార్టింగ్ లోనే మీరు రైటింగ్ ను అందంగా రాయాలని స్పీడ్ ను పెంచకండి. నిదానంగా, అక్షరాలను స్పష్టంగా రాయండి. నెమ్మదిగా రాస్తే చేతి పట్టు పెరుగుతుంది. అలాగే దానిపై కంట్రోల్ ఉంటుంది. ఇది మీ చేతిరాతను అందంగా మారుస్తుంది.

55
గ్యాప్ ఇవ్వండి

చేతిరాత అందంగా ఉండాలంటే మాత్రం మీరు అక్షరాలను కలిపి రాయకూడదు. అక్షరం, అక్షరానికి, పదాలకు సమానంగా దూరం ఉండేలా చూసుకోవాలి. మరీ తక్కువగా, మరీ ఎక్కువగా గ్యాప్ ఉంటే కూడా చేతిరాత సరిగ్గా ఉండదు. ఇవి చిన్న చిన్న చిట్కాలే అయినా రోజూ ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చేతిరాత మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories