పిల్లలు చదువులో వీక్ గా ఉంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Sep 11, 2024, 6:07 PM IST

కొంతమంది పిల్లలు చదువులో చాలా వీక్ గా ఉంటారు. తల్లిదండ్రులేమో చదవడం లేదని పిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ పిల్లలకు చదువుపై  ఇంట్రెస్ట్ ను ఎలా తీసుకురావాలని మాత్రం ప్రయత్నం చేయరు. ఇదే తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు. 

చాలా మంది పిల్లలకు చదువుకంటే గేమ్స్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పటి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫోన్లలో తలదూరుస్తున్నారు. ఫోన్ కు అలవాటైన పిల్లలు పుస్తకాలు తీసి చదవడం చాలా తక్కువ. నిజానికి పిల్లలకు ఫోన్ పై ఉన్న ఇంట్రెస్ట్ చదువుపై ఉండదు. కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే.

పిల్లలు బాగా చదవాలని చాలా మంది తల్లిదండ్రులు స్కూల్ అయిపోగానే టూషన్లక కూడా పంపిస్తుంటారు. అయినా చదవని పిల్లలు ఉంటారు. నిజానికి చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే దీనికి అసలు కారణం. 

 నిజానికి ఏ  ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరో.. వారి ఆలోచనలు కూడా ఒకేలా ఉండవు. ప్రతి ఒక్కరికీ ఇష్టాయిష్టాలు  వేర్వేరుగా ఉంటాయి. మనం ఎలా అయితే ఆలోచిస్తామో.. మన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. అంటే పిల్లలకు చదువుపై కాకుండా వేరేదానిపై ఇంట్రెస్ట్ ఉండొచ్చు. పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు ఏం చేయొద్దో తెలుసా?

పోలిక వద్దు

స్కూల్లో చదువులో ఫస్ట్ వచ్చే పిల్లలతో చదవని పిల్లల్ని బాగా పోల్చుతుంటారు. టీచర్లే కాదు.. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాగా పోలుస్తుంటారు. వెక్కిరిస్తుంటారు. వాళ్లు చూసన్నా నేర్చుకో అని తిడుతుంటారు. కానీ ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో ఇలా అస్సలు ప్రవర్తించకూడదు. 

స్కూల్లో ఏ పిల్లలు బాగా చదువుతున్నారు, ఎవరు హుషారుగా ఉన్నారు అనేది పిల్లల వ్యక్తిత్వం పై ఆధారపడి  ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇతర పిల్లల్లాగే ఉండాలని ఆశించడం పెద్ద తప్పు. దీనివల్ల మీ పిల్లల్లో మీ పట్ల ద్వేషభావం పెరుగుతుంది. మీపై ప్రేమ పోతుంది. అలాగే చదువుపై మొత్తమే ఇంట్రెస్ట్ ఉండదు. 


కొంతమంది పిల్లలు బాగా మాట్లాడితే.. మరికొంతమంది పిల్లలు మాత్రం చాలా సైలెంట్ గా ఉంటారు. కొంతమంది బాగా అల్లరి చేస్తుంటారు. నిజానికి అల్లరి పిల్లలు కొన్ని కొన్ని సార్లు చదువుపై దృష్టి పెట్టకుండా గేమ్స్ పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపుతారు. వీళ్లు కూడా చదువులో రాణించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పిల్లలకు చదువుపై ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు

మొదటి కారణం:

ఇంట్రెస్ట్ లేకపోవడమే ఫస్ట్ రీజన్. అవును పిల్లలకు కొన్ని పాఠాలు బోరింగ్ గా అనిపిస్తాయి. ఎందుకంటే 0 పిల్లలకు ఐదు సబ్జెక్టుల్లోని అన్ని సబ్జెక్టులు నచ్చాలని రూల్ లేదు. చాలా మందికి కొన్ని సబ్జెక్టుల పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. .

రెండో కారణం:

రెండో కారణం.. పిల్లలకు చాలా తొందరగా దృష్టి మారుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారికి చదువుపై ఇంట్రెస్ట్ ఉండదు. వీరి ఇంట్రెస్ట్ వేరే వాటిపై ఉండొచ్చు. అంటు గేమ్స్ కావొచ్చు. టీవీ, ఫోన్ చూడటం కావొచ్చు. 

మూడో కారణం:

పిల్లలు బాగా చదవాలన్నా, బాగా ప్రవర్తించాలన్నా వారు పెరిగే వాతావరణం ఆరోగ్యంగా ఉండాలి. కొంతమంది పిల్లలకు స్కూల్ లో కొన్ని చెడు ఘటనలు ఎదురవుతాయి. ఇవి వారిలో ఒత్తిడిని కలిగిస్తాయి.దీంతో వారు స్కూల్ కు వెళ్లడానికి భయపడతారు. చదవడానికి భయపడతారు. కొంతమంది పిల్లలకు ఇంట్లో చదువుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో వారు చదువుకోవడానికి భయపడొచ్చు.

చదువుపై ఆసక్తి పెంచే మార్గాలు:

పిల్లలకు పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ పిల్లలకు కొత్త పద్దతిలో చదువు నేర్పితే వారు ఖచ్చితంగా చదువులో రాణిస్తారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టెక్నాలజీ డివైజ్ లను వాడుతున్నారు. మీరు ఈ పద్దతిలో మీ పిల్లలకు చదువు చెప్పొచ్చు. 

ఉదాహరణకు..మీ  పిల్లలు గణితం అంటే భయపడుతుంటే.. మీరు దానిని ఒక పాఠంగా కాకుండాఒక ఆటగా నేర్పడానికి ప్రయత్నించండి. దీన్ని నేర్పడానికి  ఇప్పుడు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ తీసుకురావడానికి మీరు దీనిని ఉపయోగించొచ్చు. యూట్యూబ్ లో ఫ్రీ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి.

రోజంతా టీవీ చూడటం, సెల్ ఫోన్లలో ఎక్కువ సేపు గడపడం వల్ల పిల్లలు చదువుపై ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. మీరు హోంవర్క్ రాయడానికి మొబైల్ ను పిల్లలకు ఇస్తే వారికి వేరే ఏ వీడియోలు కనిపించకుండా చేయండి. అలాగే అనవసరంగా సెల్ ఫోన్లు ఇవ్వకండి. ఇదే వారికి చదువు రాకుండా చేస్తుంది.

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని ఉద్యోగం చేయడం ఎంతకష్టమో అందరికీ తెలిసిందే. కాబట్టి మీ పిల్లల్ని గంటలక గంటలు ఒకేదగ్గర కూర్చొని చదవమని ఫోర్స్ చేయకండి. పిల్లల్ని చదవమని చెప్పేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి. దీంతో మీ పిల్లలు చదువుకునే టైంలో అలసిపోకుండా చురుగ్గా నేర్చుకుంటారు. 

అలాగే మీ పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయండి. వీరి దృష్టి మారకుండా ఉండే స్థలాన్ని చూడండి. చదువుకునే రూంలో బెడ్ అస్సలు ఉండకూడదు. చదువుపై ఇంట్రెస్ట్ ను పెంచే విధంగా పరిసరాలను ఏర్పాటు చేయండి. దీంతో మీ  పిల్లలు అలసటే రాకుండా బాగా చదువుకుంటారు.

Latest Videos

click me!