ఆరోగ్యకరమైన ప్రవర్తన
తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరు మెరుగ్గా చూడాలనుకుంటే వారి ప్రవర్తనను మీరు మోడల్ చేయాలి. ఇందుకోసం మీరు మీ పిల్లల ముందు ఫోన్ చూడటాన్ని తగ్గించాలి. మీరు ఎక్కువగా ఫోన్ చూసుకుంటూ, పిల్లలను మాత్రం ఫోన్ చూడొద్దని చెబితే వారు వినరు. వారు మారాలంటే ముందు మీరు ఫోన్ ను ఉపయోగించే సమయాన్ని తగ్గించాలి.
డిజిటల్ వ్యసనం వల్ల వచ్చే నష్టాల గురించి మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి చెప్పాలి.
స్క్రీన్-ఫ్రీ జోన్‌లు
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసే వారైతే..వీళ్లు పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి పడుకునే ముందు, తినేటప్పుడు పిల్లలతో మాట్లాడొచ్చు.వీళ్లు ఇంట్లోని కొన్ని ప్రాంతాలను అంటే బెడ్‌రూమ్ లేదా డైనింగ్ టేబుల్ వంటి వాటి దగ్గర ఫోన్ ను అస్సలు ఉపయోగించకూడదు. ఇలాంటి నియమాన్ని సెట్ చేండి. ఇది మీ పిల్లలు ఫోన్ చూడటాన్ని తగ్గిస్తుంది.
గేమ్స్
మీ పిల్లలు ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి ఆటలు, పజిల్స్ వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయండి. ఇది వారిని ఫోన్ వ్యసనం నుంచి బయటపడేస్తుంది. దీనిలో వారి హాబీలు, గేమ్స్, ఇతర శారీరక శ్రమలు ఉంటాయి.