చిన్నపిల్లలకు బిస్కెట్లు తినిపిస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Sep 10, 2024, 1:05 PM IST

తల్లిదండ్రులకు తెలిసీ, తెలియక చేసే కొన్ని పనుల వల్ల చిన్న పిల్లలు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో చిన్నారులకు బిస్కెట్లు ఇవ్వడం కూడా ఉంది. అవును చిన్న పిల్లలకు బిస్కట్లను అస్సలు తినిపించకూడదు. ఎందుకంటే?

పిల్లలకు బిస్కెట్లు

చిన్న పిల్లలు బిస్కెట్లను చిలా ఇష్టంగా తింటుంటారు. అందుకే ప్రతి పేరెంట్స్ పిల్లల కోసం రకరకాల బిస్కెట్లను కొని తెస్తుంటారు. వారు ఏడిచినప్పుడు, ఆకలి ఆయినప్పుడో వారికి ఇస్తుంటారు. చాలా మంది తల్లులు పాలిచ్చిన తర్వాత పిల్లలకు ఖచ్చితంగా బిస్కెట్లను చేతికి అందిస్తుంటారు. 

దీనికి ప్రధాన కారణం.. టీవీ యాడ్ లో పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడాన్ని చూసే. వీటిని చూసే బిస్కెట్లు చాలా హెల్తీవీ, చాలా పోషకాలు ఉంటాయని, టేస్టీగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివని తల్లిదండ్రులు భావిస్తుంటారు. 

కానీ పిల్లల ఆరోగ్యానికి బిస్కెట్లు అస్సలు మంచివి కావు. నిజానికి బిస్కెట్ల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి నోటికి టేస్టీగా ఉంటాయే తప్ప వాటివల్ల వచ్చే ప్రయోజనం మాత్రం సున్నా అనే చెప్పాలి. నిజానికి బిస్కెట్లలో ఎలాంటి పోషకాలు ఉండవు. 

పిల్లలకు బిస్కెట్లు

ఈ ఎలాంటి ప్రయోజనం లేని బిస్కెట్లను పిల్లలు తినడం వల్ల వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కానీ ఈ సంగతి ఈ తరం తల్లిదండ్రులకు తెలియదు. అసలు పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 మీకు తెలుసా? బిస్కెట్లలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్, పొటాషియం, సోడియం, కృత్రిమ తీపి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

పిల్లలు బిస్కెట్లు తినడం వల్ల కలిగే నష్టాలు :

1. ఎక్కువ ప్రాసెస్ చేయబడతాయి : సాధారణంగా బిస్కెట్లను శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచులు, కొవ్వులు, సోడియం, రంగులతో తయారుచేస్తారు. మీకు తెలుసా? బిస్కెట్లు కూడా ప్రాసెస్ చేయబడతాయి. ఇలాంటి పిల్లల ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. వీటిని తిన్న పిల్లలకు జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలతో కూడా పిల్లలు బాధపడతారు. 

Latest Videos


పిల్లలకు బిస్కెట్లు

2. జీర్ణ సమస్య : బిస్కెట్లను తయారుచేయడానికి ఉపయోగించే శుద్ధి చేసిన గోధుమ పిండి, మైదా రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే గోధుమ పిండిని శుద్ధి చేయడం వల్ల దానిలోని పోషకాలు లేకుండా పోతాయి. ఇక మైదా పిండి ఎంత డేంజరో మనందరికీ తెలిసిందే. 

కాబట్టి ఈ రెండింటితో తయారు చేసిన బిస్కెట్లను  పిల్లలు తింటే వారి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే బిస్కెట్లు పిల్లల ప్రేగుల పనితీరును కూడా నెమ్మదింపజేస్తుంది. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.

ఎదిగే పిల్లలకు బిస్కెట్లు అస్సలు మంచివి కావు. ఇక చిన్న పిల్లలకు ఎప్పుడూ బిస్కెట్లను ఇస్తుంటే వారు తల్లిపాలను మానేసి కేవలం బిస్కెట్లను మాత్రమే తినాలనుకుంటారు. 

3. ఎక్కువ చక్కెర : బిస్కెట్లలో చాలా  మొత్తంలో శుద్ధి చేసిన చక్కెర ఉంటుంది. వీటిని తిన్న పిల్లల శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. దీంతో వారు విపరీతంగా బరువు పెరుగుతారు. అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే దంత సమస్యలు కూడా వస్తాయి.

పిల్లలకు బిస్కెట్లు

4. మలబద్ధకం సమస్య : బిస్కెట్లను తయారుచేయడానికి ఆరోగ్యకరమైన పదార్థాలనేమీ ఉపయోగించరు.  ఇలాంటి బిస్కెట్లను తినడం వల్ల మీ పిల్లలకు మలబద్దకం సమస్య వస్తుంది. 

5. వ్యసనపరుడయ్యేలా చేస్తుంది : బిస్కెట్లలో కొవ్వు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పిల్లలు వీటికి బానిసలుగా అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. అంటే వీటిని తినకుండా మీ పిల్లలు ఉండలేరన్న మాట.

ఇవి బిస్కెట్లను ఎక్కువగా తినాలనే కోరికలను పిల్లల్లో పెంచుతాయి. బిస్కెట్ల రుచి అలా ఉంటుంది మరి. కానీ వీటిని క్కువగా తింటే పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దీనివల్ల మీ పిల్లల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. ఇవి మీ పిల్లల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అలాగే వారి బరువును కూడా పెంచుతుంది. 

click me!