పిల్లలు మరీ బద్దకంగా ఉంటున్నారా..? పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!

First Published | Feb 7, 2024, 3:19 PM IST

 ఫోన్, టీవీలు ఇస్తే మాత్రం చాలా చురుకుగా వాటిని చూస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది అందరు ఇళ్లలో ఉండే కథే.. అయితే..  మీ పిల్లల్లో లేజీనెస్ ని దూరం చేసి యాక్టివ్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఓసారి చూద్దాం...
 


పిల్లలు మొండిగానే ఉంటారు. చెప్పిన మాట విననివారే పిల్లలు అవుతారు. కానీ.. కొందరు పిల్లల్లో బద్దకం మరింత ఎక్కువగా ఉంటుంది. అది కూడా.. ఉదయం పూట నిద్ర లేవాలంటే.. స్కూల్ కి వెళ్లడానికి చాలా మారం చేస్తారు. మరీ ముఖ్యంగా నిద్ర లేవడానికే ఎక్కువ లేజీనెస్ చూపిస్తారు. అంతేకాదు.. హోం వర్క్ చేయమన్నా.. తినమన్నా ఏది చేయించాలన్నా కష్టమే. పేరెంట్స్ కి అప్పుడు బీపీ లెవల్స్ పెరిగిపోతాయి. అదే ఫోన్, టీవీలు ఇస్తే మాత్రం చాలా చురుకుగా వాటిని చూస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది అందరు ఇళ్లలో ఉండే కథే.. అయితే..  మీ పిల్లల్లో లేజీనెస్ ని దూరం చేసి యాక్టివ్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఓసారి చూద్దాం...

Parenting Tips- Make lazy kids superman like this


తెలివిగా ఉండటం: అవును. చాలా ఇళ్లలో తల్లిదండ్రులు సోమరిపోతులు. పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినరు. వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టే చేస్తారు. అమ్మా నాన్నలు గ్యాడ్జెట్‌లకు అడిక్ట్ అయి అందులో లీనమైతే పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. అంతకంటే ముందు మీ స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి మంచి పనిలో నిమగ్నం చేయండి. ఫోన్లు , గాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించండి. అప్పుడు పిల్లల ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయండి.


Lazy


పిల్లలకు కూడా బాధ్యత ఇవ్వండి: మీరు పిల్లలకు ఏదైనా పనిని లేదా ఏదైనా పెద్ద బాధ్యతను ఇచ్చినప్పుడు, మీరు ఆ పని చేయడానికి వారిని ప్రేరేపించాలి.  వారు ఈ పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ప్రోత్సహించాలి. ఈ పని చేయడానికి వారికి తగినంత  బలం ఉందని, ఎవరి సహాయం వారికి అవసరం లేదు అని వారిని మోటివేట్ చేయాలి.

Image: Getty Images

కొత్త విషయాలు చెప్పండి: కొత్త విషయాలు నేర్చుకునే పిల్లలు సాధారణంగా ఇతరుల కంటే తక్కువ సోమరితనం కలిగి ఉంటారు. కాబట్టి పాఠశాల, పాఠ్యేతర కార్యకలాపాలు లేదా రోజువారీ అనుభవాల ద్వారా కొత్త నైపుణ్యాలు, జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాలను వారికి అందించండి. ఇది వారి మనస్సును చురుకుగా, నిమగ్నమై ఉంచుతుంది. ఇది వారిని ప్రేరేపించేలా చేస్తుంది.

parents

 చాలా మంది పిల్లలు ఇంట్లో ఉన్న అమ్మానాన్న, నానమ్మ, తాతయ్యలు.. తమకోసం పని చేయడానికే ఉన్నట్లు ఫీలౌపోతూ ఉంటారు. అయితే వారికి : కుటుంబ సభ్యులు బానిసలు కాదని పిల్లలకు తెలియజేయండి.  అందరికీ, గౌరవం ఇవ్వాలని.. దయతో ఉండాలని నేర్పించాలి. జాలి,  దయ తెలిసిన పిల్లలు తక్కువ సోమరితనం కలిగి ఉంటారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు.
 

Latest Videos

click me!