పిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఇదే..!

First Published | Feb 6, 2024, 3:05 PM IST

Parenting Tips: పిల్లలు ఎలా తయారవుతారనేది తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం విషయంలో ఏ మాత్రం కేర్ లెస్ గా ఉండకూదడు. అలాగే మీ పిల్లలు ప్రతి విషయానికి బయపడకుండా బలంగా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లలే ఎంతో ప్రత్యేకమైనవారు. తల్లిదండ్రులుగా మారినప్పటి నుంచి వారి లోకం మొత్తం పిల్లలే నిండిపోతారు. పిల్లలే వారి లోకంగా బతుకుతారు. అందుకే పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి మంచి లైఫ్ ను ఇవ్వడానికి, వారి భవిష్యత్తు కోసం శక్తికి మించి ప్రయత్నం చేస్తారు. వారికోసమే కష్టపడతారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రతి క్షణాన్ని కేటాయిస్తారు. పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రి కేర్ లెస్ గా లేకున్నా.. వారిని జాగ్రత్తగా, సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో పిల్లల్ని బలహీనంగా చేస్తారు. కానీ ఇలాంటి పిల్లలు ప్రతి చిన్న విషయానికి కూడా భయపడిపోతుంటారు. ఇతరులతో కలవలేరు.  ఇది మీ పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. 
 

అందుకే మీ పిల్లలను స్ట్రాంగ్ గా చేయాలనుకుంటే తల్లిదండ్రులుగా మీరు మీ అలవాట్లలో కొన్నింటిని మానుకోవాలి. నియంత్రించుకోవాలి. దీంతో మీ పిల్లలు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలను రక్షించడానికి.. మీరు వారి ముందు కాకుండా వారి వెనుక నిలబడాలి. వాళ్లను అతన్ని నడిపించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయండి. మీరు కూడా మీ పిల్లలను బలంగా తయారు చేయాలనుకుంటే ఈ కింది పనులు చేయడం మానుకోండి. 


అడిగిన దానికి సమాధానం చెప్పనీయకపోవడం

ఒకవేళ మీ పిల్లలను ఏవైనా ప్రశ్నలు అడిగితే.. వాళ్లకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి. ఇలా చెప్పనిస్తేనే వాళ్లు ఏది సరైన ఆన్సర్, ఏది కాదో? అంటూ వాటి అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే జనాలను ప్రశ్నించడం కూడా నేర్చుకుంటారు. 
 

అవసరమైన దానికంటే ఎక్కువ సహాయం 

పిల్లలకు అవసరమైన చోట సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా. కానీ వారికి అతిగా సహాయం చేస్తే.. అసలు సమస్య తలెత్తుతుంది. అవును ఇలా మీరు వారు అడగకముందే అన్నీ చేసుకుంటూ పోతే వారి శరీరం, మనస్సుకు ఏ పని ఉండదు. కనీసం ఏం చేయాలో కూడా ఆలోచించవు. అలాగే దీనివల్ల ప్రతి చిన్న దానికి కూడా మీపై ఆధాపడతారు. ఇది వారి జీవితంలో ఎన్నో  ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కాబట్టి జీవితంలోని కష్టాలను వారు స్వయంగా ఎదుర్కోనివ్వండి. అలాగే అవసరమైన చోట మీ చేయి అందించండి. 
 

అవసరమైన దానికంటే ఎక్కువ బహుమతులు 

పిల్లలకు ప్రతి విషయంలోనూ బహుమతులు ఇవ్వడం వారిని చెడగొట్టినట్టే అవుతుంది. అందుకే కారణం లేకుండా వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి. పిల్లలకు మీ సమయమే ఉత్తమ బహుమతి. కాబట్టి వారితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. 

సమస్యలు తలెత్తకుండా..

పిల్లలకు వారి సమస్యలను వారే పరిష్కరించడానికి అవకాశం ఇవ్వండి. ఎలా సమస్య పరిష్కారమవుతుందో ఆలోచించనివ్వండి. ఒకవేళ సమస్యతో మానసికంగా మరింత ఒత్తిడికి గురైతే మాత్రం మీ మద్దతు ఇవ్వండి. సహాయం చేయండి. పిల్లలే తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటే ఎంతో ధైర్యవంతులు అవుతారు. 

Latest Videos

click me!