పిల్లలకు మలబద్దకం.. ఏం చేయాలంటే?

First Published | Feb 7, 2024, 12:37 PM IST

చాలా మంది పిల్లలు మోషన్ కు సరిగ్గా వెళ్లరు. వారిని రెండు మూడు సార్లు మాత్రమే వెళుతుంటారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యంగా ఉండరు. మరి పిల్లల్లో మలబద్దకాన్ని తగ్గించేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

constipation

పిల్లలలో మలబద్ధకం.. ఒక సాధారణ సమస్య. నిజానికి మలబద్ధకానికి ఎన్నో సమస్యలు కారణం కావొచ్చు. మీ పిల్లలు వారానికి మూడు రోజులు మాత్రమే మోషన్ కు వెళితే.. వారు మలబద్దకం సమస్యతో బాధపడుతున్నట్టే. అంతేకాదు ఈ పిల్లలను మలవిసర్జన సమయంలో నొప్పిని కూడా అనుభవిస్తారు. మరి పిల్లలు మలబద్దకం సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

constipation in children

ఫైబర్ ఫుడ్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను పిల్లలకు ఇస్తే వారు మలబద్దకం నుంచి బయటపడతారు. ఫైబర్ ఫుడ్ పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే వారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చాలి. యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బ్రొకోలీ, క్యారెట్లు, బచ్చలికూర మొదలైన వాటిలో ఫైబర్ మెండుగా ఉంటుంది. 
 


constipation

ఎండుద్రాక్ష వాటర్

ఎండుద్రాక్ష నీరు పిల్లలలో మలబద్దకాన్ని సమర్థవంతంగా తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో సోర్బిటాల్ అనే సహజ పోషక లక్షణాలతో కూడిన చక్కెర ఆల్కహాల్ ఉంటుంది. అలాగే ఫైబర్ తో పాటుగా జీర్ణక్రియకు సహాయపడే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఎండుద్రాక్ష నీటిని రోజూ పరగడుపున తాగడం వల్ల మలబద్దకమే కాకుండా ఎన్నో రకాల జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. 
 

అవిసె గింజలు

అవిసె గింజలు, చియా విత్తనాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అవిసె గింజలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ అవిసె గింజలను స్మూతీ లేదా సలాడ్లలో చేర్చొచ్చు.
 

constipation

వాటర్

పిల్లల ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో..  నీళ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలను సరిగ్గా నీరు తాగకపోయినా మలబద్దకం బారిన పడతారు. అందుకే మీ పిల్లలు నీటిని పుష్కలంగా తాగేలా చూడాలి. నీరు మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

constipation 1

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పిల్లలలో మలబద్దకాన్ని నివారించొచ్చు. మీ పిల్లలు గేమ్స్, డ్యాన్స్  వంటి అవుట్ డోర్ ఆటలు ఆడేలా చూడండి. 
 

Latest Videos

click me!