ఈ క్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా 7-7-7 ఫార్ములా ఫాలో అయితే ఈ జెన్ జీ, ఆల్ఫా పిల్లలను ఈజీగా పెంచేయవచ్చు. మరి, ఆ ఫార్ములా ఏంటో చూద్దామా...
7-7-7 పెంపకం నియమం పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి సహాయపడుతుంది. దీని వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది, పిల్లలతో మీ సంబంధం బలపడుతుంది. 7-7-7 పెంపకం నియమం ప్రకారం, మీరు రోజుకు మూడు సార్లు 7-7 నిమిషాలు పిల్లలతో గడపాలి.