ఐదేళ్లలోపు పిల్లలకు నేర్పించాల్సిన లక్షణాలు..
పెద్దలను గౌరవించడం, వినయం..
పిల్లలకు చిన్న వయసులో కచ్చితంగా నేర్పించాల్సిన మొదటి లక్షణం పెద్దలను గౌరవించడం, వినయంగా ఉండటం. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడే సమయంలో ఎల్లప్పుడూ మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలని నేర్పించాలి. దీనితో పాటు, మర్యాదపూర్వకమైన పదాలు, క్షమించండి, ధన్యవాదాలు, దయచేసి వంటి సాధారణ పదాలను పిల్లలకు తప్పనిసరిగా నేర్పించడం అవసరం.
షేరింగ్ ఈజ్ కేరింగ్
షేరింగ్ ఈజ్ కేరింగ్ కూడా పిల్లలకు నేర్పించాలి. మన దగ్గర ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం గురించి పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. ఎందుకంటే ఈ లక్షణం పిల్లల స్నేహాన్ని పెంపొందించడానికి, సామాజిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు బొమ్మలు, స్నాక్స్ లేదా ఇతర వస్తువులను పంచుకోవడానికి వారిని ప్రోత్సహించాలి.