పిల్లలు చాక్లెట్స్ , స్వీట్స్ తినకూడదంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Nov 14, 2024, 2:45 PM IST

కొన్ని ట్రిక్స్ వాడితే  ఈజీగా మనం పిల్లలను ఇవి తినకుండా  కంట్రోల్ చేయవచ్చట. అదెలాగో చూద్దాం…

kids eating

పిల్లలు చాక్లెట్స్, స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. పిల్లలు చాక్లెట్స్, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల  పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉబకాయం, టైప్ 2 మధుమేహం, డెంటల్ కావిటీస్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, మనం ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా పిల్లలు  ఊరుకోరు. కొన్ని ట్రిక్స్ వాడితే  ఈజీగా మనం పిల్లలను ఇవి తినకుండా  కంట్రోల్ చేయవచ్చట. అదెలాగో చూద్దాం…

పిల్లలు షుగర్ క్రేవింగ్స్ తగ్గించడానికి..మనం ఒకేసారి వాటిని ఇవ్వడం మానేయడం కరెక్ట్ కాదు.  ముందు తక్కువ క్వాంటిటీ ఇవ్వడం మొదలుపెట్టాలి. మిఠాయిలు, కుకీలు, సోడా వంటి షుగర్ ఫుడ్స్ ముందు ఇంట్లో ఉంచుకోవడం మానేయాలి. దీనికి బదులగా పండ్లు, గింజలు, కూరగాయలు ఎక్కువగా వారి డైట్ లో భాగం చేయడం అలవాటు చేయాలి. ఇవి తినడం వల్ల  షుగర్ క్రేవింగ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి.


బ్యాలెన్స్డ్ ఆహారం…

పిల్లల్లో షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి పిల్లల డైట్ లో పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని ఇవ్వాలి. మీ పిల్లలను పూర్తిగా, సంతృప్తికరంగా ఉంచడానికి వారి ఆహారంలో తగినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని నిర్ధారించుకోండి. అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడానికి, చక్కెర కోరికలను అరికట్టడానికి వారి ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలను చేర్చండి.

స్వీట్స్, చాక్లెట్స్ కి బదులు వీటిని ఇవ్వండి…

మీ బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు చక్కెర స్నాక్స్ కోసం చేరుకోవడానికి బదులుగా, చక్కెర లేకుండా వారి ఆకలిని తీర్చే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను వారికి అందించండి. పండు, గింజలు లేదా ఒక కప్పు పెరుగు వంటి పోషకమైన చిరుతిండిని అందించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను అందించడం ద్వారా, షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి.

మీరు కూడా వాటికి దూరంగా ఉండాలి…

పిల్లలు ఎక్కువగా తమ పిల్లలను చూసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే…. ముందు మీరు చెక్కర ఆహారాలను దూరంగా ఉంచుతూ… హెల్దీ ఫుడ్స్ తినాలి. అప్పుడు..పిల్లలు కూడా మిమ్మల్ని చూసి హెల్దీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంటారు.

kids eating

మినిమమ్ వ్యాయామం…

పిల్లలకు కనీసం శారీరక వ్యాయామం  ఉండాలి. దాని వల్ల వారు ఉత్సాహంగా, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గితే షుగర్ క్రేవింగ్స్ తినాలి అనే ఆలోచన రాదు. సైక్లింగ్, డ్యాన్స్, స్విమ్మింగ్  లాంటివి చేయిస్తూ ఉండాలి. 

Latest Videos

click me!