పిల్లలను నిద్రపుచ్చడం అంత సులువైన పని కాదు. కష్టపడి నిద్రపుచ్చినా మధ్యలోనే లేచి ఏడుస్తూ ఉంటారు. పేరెంట్స్ నిద్ర కూడా పాడుచేస్తారు. కానీ, పిల్లలకు మంచి నిద్ర చాలా అవసరం. మంచిగా నిద్రపోయినప్పుడే..వారి ఎదుగుదలకు సహాయపడుతుంది. సరిగా నిద్రపోకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పిల్లలలు సరిగ్గా నిద్రపోకపోవడం అనేది ఒక సాధారణ సమస్యే. కానీ.. దానిని మనం ఫుడ్ అలవాట్లతో ఆ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూద్దాం....
పిల్లలకి మంచి నిద్ర కోసం ఉత్తమ ఆహారాలు
అవును, పిల్లలు మంచి నిద్ర పొందడానికి వారు తినే ఆహారం సరైనదిగా ఉండాలి. దీని కోసం పిల్లల ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా వారు రాత్రి బాగా నిద్రపోతారు. అంతేకాకుండా వారు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.
కాబట్టి, పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి వారికి ఎలాంటి ఆహారాలు ఇవ్వాలి అనే దాని గురించి ఈ పోస్ట్‌లో చూద్దాం.
పిల్లల మంచి నిద్ర కోసం రాత్రి ఇవ్వవలసిన ఆహారాలు:
అరటిపండు:
అరటిపండులో మంచి మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల అవి కండరాలను సడలించడానికి, శరీరాన్ని శుభ్రపరచడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది కాకుండా మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది. కాబట్టి పిల్లలకి రాత్రి పడుకునే ముందు అరటిపండు ఇవ్వండి.
పాల ఉత్పత్తులు:
పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులలో కాల్షియం, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తి చేసే అమైనో ఆమ్లం. ఇది నిద్ర ఫ్రీక్వెన్సీని నియంత్రిస్తుంది. కాబట్టి పిల్లల ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చితే వారికి రాత్రి మంచి నిద్ర వస్తుంది.
ధాన్యాలు:
పిల్లల ఆహారంలో ధాన్యాలను చేర్చితే వారికి కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనికి కారణం ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, ట్రిప్టోఫాన్ ఉండటమే. ఇది వారి మంచి నిద్రకు ఉత్తమ ఆహారం.
చెర్రీస్
చెర్రీస్ పిల్లల మంచి నిద్రకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా ఇది తినడానికి రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల రాత్రి భోజనంలో దీన్ని చేర్చుకోవచ్చు.
బాదం
సాధారణంగా బాదం పిల్లలకి ఉదయం ఇవ్వాలని మీరు విని ఉంటారు కానీ రాత్రి కూడా ఇవ్వవచ్చు. బాదం పిల్లల మంచి నిద్రకు దోహదపడుతుంది. కావాలంటే, పిల్లలు పడుకునే ముందు రాత్రి బాదం పాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే బాదం పాలలో అధిక మొత్తంలో మెలటోనిన్ ఉండటం వల్ల అది వారి నిద్రను పెంచుతుంది.