పిల్లలకు 10ఏళ్లలోపే నేర్పించాల్సిన విషయాలు ఇవి

First Published | Nov 11, 2024, 4:49 PM IST

పిల్లల జీవితంలో సంతోషంగా, విజయవంతం అవ్వాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ, వారు అలా అన్ని విషయాల్లో విజయం సాధించాలి అంటే.. వారికి పదేళ్లలోపే కొన్ని విషయాలను నేర్పించాలట. మరి, ఎలాంటివి నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి పేరెంట్స్.. తమ పిల్లల జీవితం అందంగా, అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. తమ పిల్లల జీవితం సంతోషంగా, అన్నింట్లోనూ విజయం సాధించాలని అనుకుంటారు. అయితే.. పిల్లల జీవితం  అలా ఉండాలి అంటే పేరెంట్స్ తమ  పిల్లలకు కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను  నేర్పించాలట. మనం ముఖ్యంగా పదేళ్ల  వయసులోనే కొన్ని నైపుణ్యాలను నేర్పించడం వల్ల  పెద్దయ్యాక వారి జీవితాలకు చాలా అద్భుతంగా  సహాయపడుతుందట.  చాలా మంది.. చిన్నపిల్లుల.. ఇప్పుడే ఎలా నేర్చుకుంటారు. పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే అనేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పట. మరి, పిల్లలకు ముఖ్యంగా నేర్పించాల్సిన విషయాలు ఏంటో చూద్దాం...

పిల్లలు పేరెంట్స్ కళ్లకు చాలా చిన్నగా కనపడుతూ ఉంటారు. దాని వల్ల తమ పిల్లలను పేరెంట్స్ ఎక్కువగా కష్టపెట్టాలి అని అనుకోరు. కానీ.. పేరెంట్స్ ఊహించినదాని కంటే... ఎక్కువ నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మొక్కై వంగనిది మ్రానై వంగునా అని.. చిన్నతనంలోనే మనం నేర్పించాలి.  చిన్న వయస్సులోనే మీరు మీ పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించగలరు. మీరు వారిని ఎలా పెంచుతారో వారు అలాగే ప్రవర్తిస్తారు. పిల్లలు పెద్దయ్యాక ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడం లేదా అంగీకరించడం వారికి చాలా కష్టం.

మీ పిల్లలు జీవితంలో సంతోషంగా, విజయవంతంగా ఉండాలంటే, కొన్ని జీవిత నైపుణ్యాలను 10 ఏళ్లలోపు నేర్పించాలి.


పేరెంటింగ్ చిట్కాలు

10 ఏళ్లలోపు పిల్లలకు నేర్పాల్సిన జీవిత నైపుణ్యాలు:

సంభాషణ నైపుణ్యం

పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం, వినడం,తమ భావాలను సమర్థవంతంగా తెలియజేయడం నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.

సమస్య పరిష్కారం

పిల్లల వయస్సుకు తగిన కొన్ని సవాళ్లు, పజిల్స్ వారి ముందు ఉంచండి. దీని ద్వారా వారు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇలా చేయడం ద్వారా పెద్దయ్యాక సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు.

వైఫల్యంలో పాఠం

జీవితంలో కొన్ని వైఫల్యాలు రావడం సహజం, వైఫల్యం జీవితంలో ఒక భాగం అని మీ పిల్లలకు అర్థం చేయించండి.  వారు అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. వైఫల్యం నుండి పిల్లలు తిరిగి లేవడం మరియు తప్పుల నుండి నేర్చుకోవడం ఎలాగో వారికి నేర్పించండి.
 
బాధ్యత

వయస్సుకు తగినట్లుగా మీ పిల్లలకు బాధ్యతలను నేర్పించండి. అంటే వారి వస్తువులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, పనులను ఎలా పూర్తి చేయాలి, బాధ్యతలను ఎలా నెరవేర్చాలి వంటి విషయాలను నేర్పించండి.

సానుభూతి

మీ పిల్లలను ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి, పరిగణనలోకి తీసుకోవడానికి ప్రోత్సహించండి. ఇలా చేయడం ద్వారా వారు పక్షపాతం లేకుండా, దయతో పెరుగుతారు. ఇది వారి జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టైమ్ టేబుల్

విజయవంతమైన జీవితానికి సమయ నిర్వహణ చాలా ముఖ్యం. దీన్ని మీ పిల్లలకు నేర్పించండి. దీనికోసం మీ పిల్లల టైమ్ టేబుల్ తయారు చేయమని చెప్పండి. అందులో మీ పిల్లలు ఏ పనులు చేయాలి, ఎంత సమయంలో చేయాలి అని రాయమని చెప్పండి. మొదట్లో వారు చేయలేకపోయినా క్రమంగా నేర్చుకుంటారు.

ఆర్థిక అవగాహన

డబ్బును ఆదా చేయడం, ఖర్చు చేయడం వంటి ప్రాథమిక అంశాలను మీ పిల్లలకు నేర్పించండి. ఇలా చేయడం ద్వారా వారు కష్టకాలంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా బయటపడతారు. దీనికోసం మీరు మీ పిల్లలకి ఒక పిగ్గీ బ్యాంక్ కొనిచ్చి అందులో కొంత డబ్బు ఆదా చేయమని చెప్పండి. దీని ద్వారా వారు డబ్బు  ప్రాముఖ్యతను, దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.

Latest Videos

click me!