పిల్లలకు పాలల్లో ఏం కలిపి ఇస్తున్నారు..?

First Published | Nov 8, 2024, 4:59 PM IST


కాల్షియం పిల్లలకు పాలల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకే రోజూ పేరెంట్స్ తమ పిల్లలకు  వారి డైట్ లో పాలు భాగం చేయాలని అనుకుంటూ ఉంటారు.

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వారి ఎముకలు, దృఢంగా ఉండాలన్నా కాల్షియం చాలా అవసరం. అయితే… కాల్షియం పిల్లలకు పాలల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకే రోజూ పేరెంట్స్ తమ పిల్లలకు  వారి డైట్ లో పాలు భాగం చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ప్లెయిన్ మిల్క్ పిల్లలకు ఇవ్వకూడదు. అలా అని మార్కెట్ లో దొరికే చెత్తను కలపాల్సిన అవసరం లేదు. మీ పిల్లల ఆరోగ్యాన్ని మరింత రెట్టింపు చేసే కొన్ని పదార్థాలను కచ్చితంగా ఆ పాలల్లో కలపాలట. మరి, అవేంటో ఓసారి చూద్దాం…

చిన్న పిల్లలకు సమతుల్యమైన ఆహారం అందించడం అవసరం.అంటే.. వారు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దాని కోసం పిల్లలకు కృత్రిమ పోషకాహారాలు తినిపించే బదులు.. ఎలాంటి రసాయనాలు లేని పానియాలు ఇవ్వాలి. అందుకు పాలు మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు.

ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. పాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తుంది. అయితే..  పాలు తాగడానికి మాత్రమే కాకుండా.. పసుపు, తులసి, బాదం పొడి లాంటివి కలిపి ఇవ్వాలట. వీటిని కలిపి ఇస్తే.. పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…

చలి ,వర్షాకాలంలో పిల్లలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. దీని నుంచి వారిని రక్షించాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. పాలలో కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను కలుపుకుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.


turmeric milk

పసుపు:

పసుపు పొడిని పాలలో కలిపి తాగడం చాలా ఇళ్లలో సాధారణం. పిల్లలకు కూడా పాలు తాగడం కంటే పసుపును పాలలో కలిపి ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దానిలో పసుపు వేసి పెరిగే పిల్లలకు కొంత పోషకాలు అందుతాయి. పసుపు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ అలర్జీ గుణాలు పిల్లలకు చాలా అవసరం. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. బాల్యంలో ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు పసుపు ఉపయోగకరంగా ఉంటుంది.

milk

అల్లం:

పాలలో అల్లం కలపడం వల్ల కూడా  మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. అల్లం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అల్లం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. అల్లంతో పాలు మరిగించడం కంటే అల్లం పొడిని కలిపితే మంచి రుచి వస్తుంది. ఇది పిల్లలను గ్యాస్ నుండి రక్షిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జలుబు, దగ్గు చికిత్సలో చాలా సహాయపడతాయి.కొంచెం కారంగా ఉంటుంది. కాబట్టి కాస్త తక్కువ మొత్తంలో వేసిపిల్లలకు ఇవ్వాలి.

తులసి:

తులసి ఆకులను పాలలో కలిపి పిల్లలకు తాగించవచ్చు. దీంతో పాల నాణ్యత మెరుగుపడుతుంది. తులసిలో ఉండే ఔషధ గుణాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తులసి ఆకులను పాలలో మరిగిస్తే దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు తగ్గుతాయి. తులసి పాలు శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి, నిరోధించడానికి సహాయపడుతుంది.

child death

బాదం పొడి:

బాదంపప్పులో రకరకాల పోషకాలు ఉంటాయి. పాలతో కలిపితే రుచి కూడా పెరుగుతుంది. పిల్లలకు ఆహారం ఇవ్వడానికి బాదం పాలు మంచి ఎంపిక. ఇందులో ఉండే విటమిన్లు పిల్లల చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదం పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వారి మేధస్సును అభివృద్ధి చేస్తుంది. బాదంపప్పు పొడిని ఇంట్లోనే తయారు చేసి పాలలో కలిపి పిల్లలకు ఇస్తే వారు ఇష్టపడి తాగుతారు. వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

Latest Videos

click me!