పిల్లలకు డైపర్లు వేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 7, 2024, 2:49 PM IST

ఈ రోజుల్లో డైపర్ల వాడకం బాగా పెరిగిపోయింది. అప్పుడు పుట్టిన పిల్లల నుంచి రెండేండ్ల పిల్లల వరకు డైపర్లను వాడుతున్నారు. కానీ ఈ డైపర్ల వల్ల పిల్లలకు ఏమౌతుందో తెలుసా? 


పిల్లల్ని కనడమే కాదు.. వారిని బాగా చూసుకోవడం కూడా తెలియాలి తల్లిదండ్రులకు. వారిని చదివించడం, మంచి అలవాట్లను నేర్పించడం, మంచి మనిషిగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ శిశువులు, 1  నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలను చూసుకోవడం ప్రతి తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని. 

5 ఏండ్ల తర్వాత పిల్లలు పరుగెడుతూ.. మనం ఏం చెప్పినా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వీరు తల్లిదండ్రుల మాట వింటారు. అలాగే వాళ్ల ప్రాబ్లమ్స్ ను కూడా తల్లిదండ్రులకు చెప్పుకోగలుగుతారు. కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు ఏం చెప్పలేం. అలాగే వారికున్న సమస్యలను కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు.
 


 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలు తరచుగా మూత్రానికి వెళుతూ..  మలవిసర్జన చేస్తుంటారు. అందుకే చాలా మంది పేరెంట్స్ ఈ వయసు పిల్లలకు ఎప్పుడూ డైపర్లను తొడుగుంటారు. కానీ ఈ డైపర్లను సమయానికి మార్చడం చాలా అవసరం. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. 

పిల్లలకు డైపర్లు అవసరమా?

 అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ..పిల్లలకు క్లాత్ న్యాప్కిన్స్, డైపర్ల వాడకంపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. నవజాతశిశువు నుంచి ఒక సంవత్సరం బిడ్డ వరకు డైపర్ ను ఎంత వరకు ఉపయోగించాలి? డైపర్ ను ఎంతసేపటికి మార్చాలి? వంటి కొన్ని విషయాలను వెల్లడించింది.

ఇప్పుడు విపరీతంగా డైపర్లను వాడుతున్నారు. కానీ వీటికంటే క్లాత్ న్యాప్కిన్లే మంచివి. నవజాత శిశువులకు క్లాత్ న్యాప్కిన్లను కట్టడమే మంచిది. వీటిని ఒక సారి వాడిన తర్వాత ఉతికేసి మళ్లీ ఎండలో ఆడబెట్టి వాడొచ్చు. 

Latest Videos


డైపర్లను, న్యాప్కిన్లను ఎంత సేపటికి మార్చాలి? 

నవజాత శిశువులకు డైపర్లను, న్యాప్కిన్లను ప్రతి గంటకోసారి మార్చాలి. ఇకపోతే 4 నుంచి 5 నెలల పిల్లలకు ప్రతి 3 నుంచి 4 గంటలకోసారి క్లాత్ న్యాప్కిన్ ను ఖచ్చితంగా మార్చాలి. డైపర్ కు ఇలా చేయకూడదు. ఎందుకంటే డైపర్ లోని జెల్ తేమను గ్రహిస్తుంది. ఎందుకంటే డైపర్ ను సింథటిక్ పాలిమర్, సెల్యులోజ్ ఫైబర్ తో తయారు చేస్తారు.

డైపర్ వాడకం వల్ల వచ్చే సమస్యలు 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లల మూత్రం 2-3 గంటల వరకు ఎలాంటి సమస్యలను కలిగించదు. కానీ మలవిసర్జన చేస్తే మాత్రం ఈ డైపర్, మలం జెల్ రసాయన ప్రతిచర్యకు కారణమవుతుంది. దీంతో డైపర్ వల్ల మీ బిడ్డకు దద్దుర్లు వస్తాయి.

చర్మం దురద పెడుతుంది. దీనివల్ల వారికి పుండ్లు అవుతాయి. మీ పిల్లల నెల లేదా వయస్సును బట్టి రోజుకు 5-6 డైపర్లను వాడాలి. లేదా క్లాత్ న్యాప్కిన్లను ఖచ్చితంగా మార్చాలి. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బేబీ డైపర్లను వాడటం అస్సలు మంచిది కాదు. పిల్లల్ని ఎప్పుడూ కూడా గాలి, వెలుతురు వచ్చే వాతావరణంలో ఉంచాలి. అయితే డైపర్ ఉపయోగించే ముందు కొబ్బరి నూనెను చర్మానికి అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇకపోతే పిల్లల మూత్రాన్ని, మలాన్ని తుడవడానికి బేబీ వైప్స్ ను ఉపయోగించేవారు చాలా మంది ఉన్నారు. కానీ వీటికి బదులుగా కాటన్ లేదా, తడి గుడ్డతో తుడవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వైప్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. అందుకే మీ బిడ్డ వీపును ఎప్పుడూ కూడా గుడ్డతోనే తుడవండి. 

click me!