చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పొగడటం ద్వారా వారి ప్రేమను వ్యక్తంచేస్తుంటారు. పిల్లలు చిన్న విజయాలు సాధించినా.. చాలా బాగా చేశావు, నువ్వు బెస్ట్ అని చెప్తుంటారు. కానీ పిల్లల్ని అతిగా పొగడటం కూడా మంచిది కాదంటున్నారు సైకాలజీ నిపుణులు. ఎందుకో చూద్దాం.
పిల్లల్ని ప్రోత్సహించడం, వారి విజయాలను గుర్తించడం ప్రతి తల్లిదండ్రుల సహజ స్వభావం. కానీ సైకాలజీ ప్రకారం అతిగా పొగడటం పిల్లల వ్యక్తిత్వ వికాసంపై ఊహించని ప్రభావం చూపించవచ్చు. అతిగా పొగడటం వల్ల పిల్లల్లో ఫిక్డ్ మైండ్ సెట్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దానివల్ల వారు ఓడిపోయే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి విఫలం అయితే, తాము అంత గొప్పవాళ్లం కాదనే భావనతో వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.
25
పొగడ్త కోసమే..
అతిగా పొగడటం పిల్లల్లో బాహ్య ప్రోత్సాహంపై ఆధారపడే అలవాటును పెంచుతుంది. అంటే, వారు ఏ పని చేసినా “నన్ను ఎవరు పొగడతారా?” అనే ఆలోచనతో చేస్తారు. ఫలితంగా, వాళ్లు తమకు ఇష్టమైన పనులను కూడా స్వతంత్రంగా చేయకుండా, ప్రశంస కోసం మాత్రమే ప్రయత్నిస్తారు. ఇది దీర్ఘకాలంలో సృజనాత్మకతను, స్వతంత్ర ఆలోచనలను తగ్గించే అవకాశం ఉంది.
35
ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం
అతిగా పొగడటం వల్ల పిల్లల్లో అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు తమ గురించి ఏర్పరచుకునే భావన చాలా వరకు తల్లిదండ్రుల మాటలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ అధికంగా పొగిడితే, వారు తమ సామర్థ్యాన్ని అసలు స్థాయికంటే ఎక్కువగా అంచనా వేయడం ప్రారంభిస్తారు. తర్వాత వాస్తవ జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు, వాటిని తట్టుకోలేక నిరాశ చెందే ప్రమాదం ఉంటుంది.
సైకాలజీ ప్రకారం పిల్లలు తప్పులను సహజంగా అంగీకరించే వాతావరణం లేకపోతే, పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తారు. వారు విఫలం అయితే తమపై ఉన్న మంచి అభిప్రాయం తగ్గిపోతుందనే భయం వారిలో కలుగుతుంది. ఇది వారి నేర్చుకునే సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది.
55
ప్రశంస విధానాన్ని మార్చుకోవడం..
నిపుణుల ప్రకారం ప్రశంస విధానాన్ని మార్చుకోవాలి. పిల్లల వ్యక్తిత్వాన్ని కాకుండా, వారి కృషిని ప్రశంసించడం చాలా అవసరం.“నువ్వు చాలా తెలివైనవాడివి” అని చెప్పడం కంటే “నువ్వు చాలా కష్టపడి ఈ పని పూర్తి చేశావు” అని చెప్పడం మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లలు ప్రయత్నానికి విలువ ఇస్తారు. ఓడిపోయినా మళ్లీ ప్రయత్నిస్తారు. పిల్లలకు నిజాయతీతో కూడిన ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. వారు చేసిన పనిలో లోపాలు ఉంటే, వాటిని సున్నితంగా తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల వారు వాస్తవాన్ని అర్థం చేసుకొని, తమను తాము మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.