Parenting Tips: తమ పిల్లలు గొప్పగా ఉండాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అయితే… పిల్లలు గొప్పగా పెరగాలంటే తల్లిదండ్రులుగా కొన్ని పనులు చేయాలి. మరి, ఏం చేస్తే… మీరు గ్రేట్ పేరెంట్స్ అవుతారో తెలుసా..?
పిల్లల పెంపకం అంత ఈజీ కాదు. పిల్లల విద్య, శారీరక, మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది. ఇది వారి కర్తవ్యం. అయితే, ఈ రోజుల్లో తల్లిదండ్రుల బాధ్యత రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ కాలం పిల్లలు పేరెంట్స్ మాట సరిగా వినడం లేదు. మాట్లాడితే ఫోన్లు, టీవీలు కావాలని మారాం చేస్తుంటారు. మరి, ఇలాంటి పిల్లలను హ్యాండిల్ చేస్తూ…. మీరు మంచి తల్లిదండ్రులు అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
26
ఆస్తి కాదు...
పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఆస్తి కాదు. పిల్లలకు సొంత ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వారికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ప్రతి బిడ్డ తెలివైనవాడే. కానీ పిల్లలందరూ ఒకేలా ఉండరు. అందుకే పిల్లలను ఎవరితోనూ పోల్చి మాట్లాడొద్దు.
36
ఆత్మ విశ్వాసం పెంచాలి...
తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దకూడదు. పిల్లలు తప్పులు చేసి నేర్చుకోవడానికి, వారి మార్గాన్ని ఎంచుకోవడానికి అనుమతించాలి. ఇదే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వారిని సహజంగా పెరగనివ్వండి. ప్రమాదాలను, తప్పుడు పనులను చెబుతూ పెంచండి.
పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులు చెప్పింది వినరు. కానీ వారిని చూసే పెరుగుతారు. పిల్లలు మంచి గుణాలతో పెరగాలంటే తల్లిదండ్రులు ఆ గుణాలను అలవర్చుకోవాలి. మీరు పిల్లలకు ఆదర్శంగా ఉంటే వారు అద్భుతంగా ఎదుగుతారు. తల్లిదండ్రులు ఆందోళనగా, నిరాశగా ఉంటే ఆ భావాలు పిల్లలకూ వస్తాయి. ఓపిక లేని తల్లిదండ్రులు పిల్లలను కూడా అలాగే మారుస్తారు. అందుకే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటే పిల్లలూ అలానే పెరుగుతారు.
56
సంతోషకరమైన వాతావరణంలో పెంచాలి...
పిల్లల మార్కులు, ప్రతిభపై మాత్రమే తల్లిదండ్రులు దృష్టి పెట్టకూడదు. సంతోషంగా ఉండే పిల్లలు జీవితంలో రాణిస్తారని మర్చిపోవద్దు. మీ బిడ్డను సంతోషకరమైన వాతావరణంలో ఆనందంగా పెంచడమే మీ మొదటి కర్తవ్యం. పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో గమనించాలి. వారి ప్రయత్నాన్ని కూడా గౌరవించాలి.
66
పిల్లలను నిందించకూడదు...
తల్లిదండ్రులు తమతో తగినంత సమయం గడపాలని మాత్రమే పిల్లలు కోరుకుంటారు. వారిని నిందించకుండా వారితో సంతోషంగా సమయం గడపండి. వారు చేసే తప్పులను ఎత్తి చూపించకుండా… ప్రేమతో వారిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
క్లుప్తంగా చెప్పాలంటే, మంచి తల్లిదండ్రులుగా ఉండాలనుకోవడం అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే. పిల్లలతో మీరు కూడా పిల్లలుగా మారిపోండి.