పిల్లలకు చెవి నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

First Published | Nov 13, 2024, 2:50 PM IST

చలికాలంలో పిల్లలకు చెవి నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇది తగ్గడానికి తల్లులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా అస్సలు తగ్గదు. కానీ కొన్ని చిట్కాలతో చెవి నొప్పి చిటికెలో తగ్గిపోతుంది. 

చలికాలంలో పిల్లలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు బాగా వస్తుంటాయి. ఇది సర్వ సాధారణం. ఇవే కాకుండా.. ఈ సీజన్ లో చెవి నొప్పి కూడా ఎక్కువగా వస్తుంటుంది. దీనికి అసలు కారణం చలికాలంలో వీచే చల్లని గాలి. అలాగే గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కూడా పిల్లలకు చెవి నొప్పి వస్తుంటుంది. 

మీకు తెలుసా? పెద్దవారి కంటే పిల్లలకే చెవి నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. కారణం వారి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం.చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం వంటి సమస్యలు వచ్చినా కూడా చెవి నొప్పి వస్తుంది. అదికూడా వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు పిల్లల చెవిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు చెవిలోపల భరించలేని నొప్పిని కలిగిస్తాయి. 

ఈ చెవి నొప్పి వల్ల పిల్లలకు రాత్రిళ్లు సరిగ్గా నిద్ర ఉండదు. అలాగే దీనివల్ల జ్వరం కూడా వస్తుంది. కాబట్టి పిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పిల్లలకు చెవి నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

1. మీ పిల్లలకి చెవినొప్పి వచ్చినప్పుడు కంగారు పడకుండా.. వెంటనే 10 నుంచి 15 నిమిషాల పాటు చెవి చుట్టూ వేడి కంప్రెస్ పెట్టండి. దీనివల్ల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 

2. ఈ చెవినొప్పితో పాటుగా పిల్లలకు జ్వరం కూడా ఉన్నట్టైతే డాక్టర్ కు చూపించిన తర్వాతే మందును వాడండి. 

3. చెవి నొప్పితో బాధపడుతున్నప్పుడు పిల్లలకు నీళ్లను బాగా తాగించాలి. ఇలా చేయడం వల్ల నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. 

పిల్లల చెవి నొప్పి

గుర్తుంచుకోండి:

- చలికాలంలో చల్లని గాలుల వల్లే చెవి నొప్పి వస్తుంది కాబట్టి.. మీ పిల్లల్ని ఈ గాలుల నుంచి రక్షించాలి. ఇందుకోసం లేయర్డ్ దుస్తులను వేయాలి. కానీ అతిగా మాత్రం వేయకూడదు. 

- చలికాలంలో పిల్లల చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా ఎప్పుడూ కప్పి ఉంచాలి. 

- పిల్లలకు భరించలేని చెవి నొప్పి లేనప్పుడు చెవిలో దూది వంటివి పెట్టకూడదు. ఎందుకంటే ఇది నొప్పిని బాగా పెంచుతుంది. 

- చలికాలంలో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు వారి చెవుల్లోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. ఒకవేళ చెవుల్లోకి నీళ్లు వెళితే చెవి నొప్పి వస్తుంది. అలాగే పిల్లలకు చలికాలంలో స్నానం చేయించిన వెంటనే టవల్ తో బాగా తుడవాలి. 

- ఈ సీజన్ లో పిల్లలకు పండ్లు, కూరగాయలను ఎక్కువగా పెట్టాలి. ఇవి వారి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. దీంతో మీ పిల్లలు జబ్బులకు దూరంగా ఉంటారు. 

- ఈ చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పడుకునే ముందు వారి దుస్తులు పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి. 

Latest Videos

click me!