పిల్లలను పెంచడంలో చాలా పద్దతులు ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం…
పిల్లలు తమకు తెలియకుండా చిలిపి పనులు చేయడం, తప్పులు చేయడం సహజం. అలా చేసినప్పుడు వాళ్లను అలా ఎందుకు చేశారు అని ప్రశ్నించవచ్చు. లేదంటే చిన్న పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. కానీ, మరీ ఎక్కువగా హింసించకూడదు. లేదంటే.. ఏం చేయకూడదో కూడా క్లియర్ గా చెప్పాలి.
ఫ్రెండ్లీ పేరెంటింగ్…
తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యాతాయుతంగా పెంచడానికి ప్రయత్నించాలి. పిల్లలకు ప్రతి విషయం నేర్పించడానికి ప్రయత్నించాలి. పిల్లలకు 7 లేదా 8 సంవత్సరాలు వచ్చినప్పుడు, వారికి ఒక పనిని ఇవ్వండి. కుదరక పోయినా కనీసం పూర్తి చేసే వరకు ఓపిక పట్టండి. వారు ఉద్యోగం ఇష్టపడితే, కొనసాగించమని వారిని అడగండి. లేకపోతే పని పూర్తయ్యే వరకు వేచి ఉండి, ఆపై నో చెప్పండి.