నేటి కాలంలో పిల్లలు ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. దాంట్లో వీడియోలు చూడటం, ఆన్ లైన్ గేమ్స్ ఆడటం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. వీటితో పాటుగా బాగా ఆడుకుంటుంటారు. వీటన్నింటి వల్ల పిల్లల చదువు ఎక్కడ దెబ్బతింటుందోనని తల్లిదండ్రులు బాగా ఆందోళన చెందుతుంటారు. నిజానికి ఈ ఫోన్ల వల్ల చాలా మంది పిల్లలు చదువుపై ఎక్కువ ఫోకస్ చేయడం లేదు.
ఈ అలవాటును మాన్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకే పిల్లలు బాగా చదవాలని, గొప్పవారిగా ఎదగాలని తల్లిదండ్రులు పిల్లల్ని చదవాలని బాగా ఫోర్స్ చేస్తుంటారు. తిడుతుంటారు, కొడుతుంటారు. కానీ ఇలా చేసినంత మాత్రాన పిల్లలు చదువుతారనుకోవడం భ్రమే అవుతుంది. నిజానికి ఎప్పుడూ కొట్టడం, తిట్టడం వల్ల పిల్లలు మొండిగా అవుతారు. కాబట్టి పిల్లలు చదవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.