హైడ్రేషన్, మార్నింగ్ సిక్నెస్ తగ్గించడంలో సహాయపడుతుంది:
మామిడికాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. వాటి తీపి, పుల్లని రుచి కొంతమంది గర్భిణీ స్త్రీలలో వికారం తగ్గించడంలో సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో మామిడి తినేటప్పుడు అనుసరించాల్సిన చిట్కాలు:
మామిడికాయలు పోషకమైనవి అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో అన్ని మామిడి పండ్లకు పురుగుల మందులు కొడుతున్నారు. కాబట్టి.. ఎక్కువ సేపు వాటిని నీటిలో నానపెట్టి, కడిగిన తర్వాత మాత్రమే ఈ పండ్లను తినాలి. అంతేకాదు, ఈ పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా తినడం మానుకోండి. అలాగే, పండిన మామిడికాయలను ఎంచుకోండి, ఎందుకంటే పండని మామిడికాయల కారణంగా ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.