Parenting Tips: రాత్రి పడుకునే ముందు పిల్లలతో ఇవి మాట్లాడుతున్నారా?

పిల్లలతో పేరెంట్స్ అనుబంధం సరిగా ఉండాలి అంటే, వారితో ప్రేమగామ ాట్లాడటం చాలా అవసరం. మరి, ఏ సమయంలో వారితో మాట్లాడాలి? ఎలాంటి విషయాలు మాట్లాడాలి? ఏం ప్రశ్నలు వేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

bedtime conversations parents must have with their kids in telugu ram

పిల్లలు ఆనందంగా, సంతోషంగా ఉండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కొందరు పిల్లల మీద అమితమైన ప్రేమ కురిపిస్తారు. అతి గారాబం చేస్తారు.మరి కొందరు పేరెంట్స్ గారాబం చేస్తే పిల్లలు పాడైపోతారేమో అని భయపడి కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారు. అయితే.. మీరు ఎంత ప్రేమ చూపించినా, ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా  రాత్రిపూట పిల్లలు పడుకునే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా మాట్లాడాలట. అప్పుడే పిల్లలకు పేరెంట్స్ మీద నమ్మకం కలుగుతుందట. మరి, ఎలాంటి విషయాలు మాట్లాడాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలతో రాత్రి పడుకునే ముందు కొన్ని నిమిషాలు మాట్లాడినా చాలట.అవి పిల్లలపై చాలా ఎక్కువ ప్రభావమే చూపిస్తాయి. ఎందుకంటే.. ఆ సమయం పిల్లల మనసుకు నచ్చే టైమ్.అందుకే మీకు ఉన్న పనిని కాస్త పక్కన పెట్టి, వారితో మాట్లాడాలి. అప్పుడు కూడా వాళ్లను తిట్టడం, కొట్టడం లాంటివి చేయకుండా, ప్రేమగా మాట్లాడాలి. ‘ ఈ రోజు నీకు బాగా నచ్చిన విషయం ఏంటి?’,‘నిన్ను ఎక్కువగా ఆనందపెట్టిన విషయం ఏంటి?’ ఇలాంటి ప్రశ్నలు అడగాలి. వీటికి వారు చాలా సంతోషంగా సమాధానం చెబుతారు. ఇలాంటి ప్రశ్నలు పిల్లల్లో సానుకూల ఆలోచనలు పెంచుతాయి. అంతేకాదు, ‘ రేపు ఏం చేయాలి అనుకుంటున్నావ్?’ అని కూడా అడగాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పిల్లలు ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తారు.



ఈ రోజు ఎలా గడిచింది లాంటి ప్రశ్న అడిగినప్పుడు అది పిల్లల్లో ఆలోచన శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. ఈ రోజు ఏదైనా కొత్తగా నేర్చుకున్నావా అని అడిగాలి. ఈ ప్రశ్న వల్ల.. వారిలో రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.కొన్ని సార్లు పిల్లలకి ఏదైనా భయం లేదా ఆందోళన ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో, ఓపికగా, ప్రేమగా, "ఏమైనా బాధగా ఉందా?" అని అడిగి వారిని మాట్లాడేలా చేయండి. అది వాళ్లకి చాలా భద్రతగా అనిపిస్తుంది.ఇవి మాత్రమే కాదు, పిల్లలపై మీకు ఎంత ప్రేమ ఉందో, ఎందుకు ప్రేమ ఉందో కూడా చెప్పాలి. ఈ మాటలు వారిలో ధైర్యాన్ని పెంచుతుంది. ఆనందాన్ని ఇస్తుంది.

కేవలం నచ్చిన విషయాలు, బాధ కలిగించే విషయాలు మాత్రమే కాదు..ఫన్నీ విషయాలు కూడా అడగాలి. వాటికి పిల్లలు కడుపునిండా నవ్వుకుంటారు. మంచిగా రిలాక్స్అవుతారు. సంతోషంగా నిద్రపోతారు. ఇలాంటి మాటల వల్ల..  తమ పేరెంట్స్ తమను అన్ని విషయాలు అర్థం చేసుకుంటారనే నమ్మకం పిల్లల్లో కలుగుతుంది. కేవలం ప్రశ్నలు అడగడమే కాదు.. వారు చెప్పే సమాధానాన్ని ఓపికగా వినాలి. వాళ్లు ఏం చెప్పినా, విసుక్కోవడం లాంటివి చేయకూడదు.

Latest Videos

vuukle one pixel image
click me!