Parenting tips: పేరెంట్స్.. కూతుర్లకు చెప్పకూడని విషయాలెంటో తెలుసా?

Published : May 16, 2025, 01:18 PM IST

ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. వారికి కావాల్సినవి సమకూర్చడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు. అయితే అమ్మాయిలని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అవెంటో.. వాటి వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
Parenting tips: పేరెంట్స్.. కూతుర్లకు చెప్పకూడని విషయాలెంటో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటారు. అందుకే చిన్నప్పటి నుంచే చాలా విషయాలు నేర్పిస్తారు. కానీ కొన్నిసార్లు అమ్మాయిలని పెంచేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దానివల్ల వాళ్లు జీవితాంతం బాధపడతారు. కాబట్టి అమ్మాయిలని పెంచేటప్పుడు తల్లిదండ్రులు వాళ్లతో చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

24
అమ్మాయిలకి చెప్పకూడని విషయాలు

1. ఉద్యోగంలో లింగ వివక్ష వద్దు:

 

చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇది. అబ్బాయిలు ఈ పని చేయాలి.. అమ్మాయిలు ఈ పని చేయాలి.. అని అంటారు. కానీ లింగం ఆధారంగా ఉద్యోగాన్ని ఎప్పుడూ విభజించకూడదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. వాళ్లకి నచ్చింది చేయనివ్వడం తల్లిదండ్రుల బాధ్యత. మీ అమ్మాయి ఏదైనా ఉద్యోగం ఎంచుకుంటే అది వాళ్లు చేయకూడదు అని అనకండి. బదులుగా వాళ్లని ప్రోత్సహించండి.

2. దుస్తులపై నియంత్రణ:

దుస్తులపై నియంత్రణ అవసరం. కానీ ఏ దుస్తులు మంచివి.. ఏవి వేసుకోకూడదు అని ప్రేమగా చెప్పి అర్థం చేయించాలి. మీ అమ్మాయి జీన్స్, షర్ట్ వేసుకోవాలనుకుంటే అది తప్పు కాదు. కానీ సందర్భానికి తగ్గట్టు వేసుకోవడం నేర్పించండి. 

34
అమ్మాయిలతో మంచిగా మాట్లాడండి..

3. నీవల్ల కాదు అనకండి!:

నువ్వు ఇది చేయలేవు! అని మీ అమ్మాయి ప్రతిభను తక్కువ అంచనా వేయకండి. ఈ తప్పు చాలా మంది తల్లిదండ్రులు చేస్తారు. దీనివల్ల వాళ్ల భవిష్యత్ దెబ్బతింటుంది. కాబట్టి మీ అమ్మాయి ఆసక్తిని గుర్తించి వాళ్లని ప్రోత్సహించండి. ఎప్పుడూ 'నీ వల్ల కాదు' అని చెప్పి బాధ పెట్టకండి.

4. గట్టిగా నవ్వొద్దు!:

నవ్వడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. కానీ చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలు గట్టిగా నవ్వితే తప్పు అని కసురుకుంటారు. కానీ అలా చేయడం తప్పు. దీనివల్ల వాళ్ల స్వేచ్ఛ హరించుకుపోయిందని వారు భావిస్తారు. కాబట్టి వాళ్లకి ఇష్టమైనట్టు నవ్వనివ్వండి.

44
5. బరువు గురించి తప్పుగా మాట్లాడకండి:

ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు చేసే ప్రధాన తప్పు ఇది. అమ్మాయి బరువు ఇలా ఉండాలి... ఎక్కువ ఉండకూడదు అని వాళ్లని ఎగతాళి చేయకూడదు. మీ అమ్మాయి లావుగా ఉంటే దాన్ని మీరు ఎత్తి చూపిస్తే వాళ్లు చాలా బాధపడతారు. కాబట్టి మీ అమ్మాయి బరువు పెరిగితే వారి గురించి తప్పుగా మాట్లాడకండి. బదులుగా, ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories