5.తల కింద ఎత్తుగా పెట్టడం…
జలుబు చేసినప్పుడు పిల్లలకు గొంతు వెనక భాగంలో శ్లేష్మం పేరుకపోతుంది. ఇది జులుుబు, దగ్గు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పడుకునే సమయంలో తల కింద ఎక్కువ ఎత్తు పెట్టాలి. అప్పుడు వారికి ఉపశమనం కలుగుతుంది. హాయిగా నిద్రపోతారు. వారికి వేడి పానియాలు తాగించాలి.
ఇతర హోం రెమిడీస్…
తేనె ఎక్కువగా ఉపశమనం కలిగించగలదు. అందుకే మీరు తేనెలో మీ వేలును ముంచి, మీ బిడ్డ రోజుకు రెండు మూడు సార్లు నాకించాలి. మీ పిల్లల వయస్సు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి.
వాము, తులసి ఆకులను మరిగించి, ఆ నీరు తాగించడం వల్ల..దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవనూనెను వెల్లుల్లితో కలిపి బిడ్డ ఛాతీ, వీపు, మెడ భాగాల్లో మసాజ్ చేయాలి. అలాగే బిడ్డ అరచేతులు, పాదాలకు నూనె రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
మీ బిడ్డ తుమ్ము ,దగ్గుతున్నప్పుడు, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. నిర్ణీత వ్యవధిలో నీరు త్రాగడం వల్ల జలుబుతో పోరాడటానికి, గొంతులో మంటను తగ్గించడానికి, ఇన్ఫెక్షన్లను కడిగివేయడానికి సహాయపడుతుంది. వేడిగా సూప్ తాగించినా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి తాగించాలి.