వైఎస్ జగన్ జగమొండి నిర్ణయాలు: కోర్టుల్లో దెబ్బల మీద దెబ్బలు

First Published Jun 3, 2020, 4:32 PM IST

మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కుదేలైన ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆక్టివ్ గా మారాయి. అమరావతి ప్రాంతంలో మొదలైన ప్రజా ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు వారి రాజకీయాలను మొదలుపెట్టాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోమునుపెన్నడూలేని విధంగా50 శాతం ఓట్లతో,151 సీట్లను సాధించి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కారు. నభూతోనభవిష్యత్తు అన్న రేంజ్ లో జగన్ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే ఆయన వెంటనే సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టారు. దానితోపాటుగాచంద్రబాబుకు సంబంధించిన గుర్తులను చెరిపేయాలన్న లక్ష్యంగాముందుకు సాగరు.
undefined
మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతోఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కుదేలైనప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆక్టివ్ గా మారాయి. అమరావతి ప్రాంతంలోమొదలైన ప్రజా ఉద్యమాన్నిఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు వారి రాజకీయాలను మొదలుపెట్టాయి.ఇలా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు మొదలైన ఎదురుదెబ్బలుఅక్కడి నుంచి కోర్టు మెట్లెక్కాయి. అలా కోర్టులువరుసగా ఏపీసర్కారునుతలంటుతూనే ఉంది.ఉంది. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు దాదాపుగా 65 సార్లు కోర్టులో తీర్పులు ప్రతికూలంగా వచ్చాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కేసులను ఒకసారి పరిశీలిద్దాము.
undefined
జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ హత్యా వెనక ఉన్నాడు అని ఆరోపణలు గుప్పించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఆ విషయంలో ఎటువంటి సాక్ష్యాధారాలను సంపాదించలేకపోయింది.హై కోర్టు ఈ విషయంలో రాష్ట్ర పోలీసులనుతప్పుబడుతూవిచారణను సిబిఐ కి అప్పగించింది. ఈ విషయంలోజగన్ సర్కారుకి ఎటువంటి ఆప్షన్ కూడా లేకుండా పోయింది.
undefined
ఈ తతంగానికికొంచం ముందు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లునుమండలిలో అడ్డుకోవడంతో, ఆగ్రహంతోఊగిపోయిన జగన్మండలినిరద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలోతీర్మానం చేసారు. ఆ కాలంలో ఆ హై వోల్టేజి పొలిటికల్ ఆక్షన్ జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది.
undefined
ఇక మరో అంశం ఇంగ్లీష్ మీడియం విద్య. ఇంగ్లీషు మీడియం ను మాత్రమే అందుబాటులో ఉంచడం అనే అంశం పై జగన్ సర్కారుకు హై కోర్టులో చుక్క ఎదురైంది.ఇంగ్లీష్ మీడియం మాత్రమే అందుబాటులో ఉంచడం ఏమిటని, విద్యార్థులకు ఛాయస్ ఉండాలని, ఇలా తెలుగు మీడియం తీసేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. విద్యాహక్కుచట్టానికి తూట్లు పొడవడమే అని అభిప్రాయపడింది.కానీ వైసీపీశ్రేణులు మాత్రం హై కోర్టు ఇంగ్లీష్ మీడియం కి అనుకూలంగా లేదు అనే ప్రచారం కూడా చేస్తుంది తప్ప. దాంట్లోని అసలు వాస్తవాన్ని మాత్రం చెప్పడం లేదు.
undefined
ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలనువాయిదా వేస్తున్నట్టురాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానేదానిపై జగన్ప్రభుత్వం తీవ్రంగా సీరియస్ అయింది.బాహాటంగానేనిమ్మగడ్డ రమేష్కుమార్ పై ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి. గవర్నర్ ని కలిసి అసంతృప్తిని వెలిబుచ్చినవిషయం దగ్గరి నుండిప్రెస్ మీట్ పెట్టి ఆయనకు రాజకీయ రంగును పులిమే వరకు తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు.
undefined
ఇక ఆ దెబ్బకు వైసీపీ శ్రేణులు ఆయనపై తీవ్రంగా, విపరీతంగా ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు, మంత్రులు కూడా ఆయనను ప్రతిపక్షరాజకీయ పార్టీకి ఏజెంట్ అంటూ ఆయనకు రాజకీయ రంగును పులిమే ప్రయత్నం చేసారు.ఇక ఆ తరువాత దానిపై హై కోర్టుకి వెళ్ళింది జగన్ సర్కార్. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేసుకునే వీలు కల్పించినప్పటికీ.... ఎన్నికల వాయిదాను మాత్రం సమర్థించింది.
undefined
ఇంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడం, లాక్ డౌన్ విధించడం నేపథ్యంలో ఒకింత ఈ విషయం సద్దుమణిగినట్టు అనిపించినా, ఏకంగారాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డనే తొలగిస్తుఒక ఆర్డినెన్సును జారీ చేసింది ప్రభుత్వం. ఆ విషయంలో హై కోర్టు ఆ ఆర్డినెన్సును తాజాగా ఒక రెండు రోజుల కింద కొట్టేసింది. అందులో ఎటువంటి మెరిట్ లేకున్నప్పటికీ సుప్రీమ్ కోర్టుకి అప్పీల్ కి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి సుప్రీమ్ ఎలా తీర్పుఇస్తుందో.
undefined
ఇక మరో అంశం గ్రామసచివాలయాలకు వైసీపీ పార్టీ రంగులు. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది.ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీనితెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు.
undefined
మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్తరీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు.కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి)చిహ్నాలని వారు చెబుతున్నారు.హై కోర్టు క్లియర్ గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేని రంగులను వేయమని చెప్పినప్పటికీ కూడా ఇలా వారి పార్టీ రంగులకే ఒక కొత్త నిర్వచనం చెప్పి వాటిని అలాగే ఉంచడం నిజంగా విడ్డూరం.దానిపై హై కోర్టు తీవ్రంగా మండిపడి. దాన్ని కోర్టు ధిక్కారణగా భావించి అధికారులను విచారానికి హాజరుకమ్మంది. దీనిపైఏపీసర్కార్ సుప్రీమ్ కి వెళ్ళింది. ఇందాక కొద్దిసేపటి కింద సుప్రీమ్ కూడా దాన్నికొట్టేసింది.
undefined
ఇక మరో అంశం డాక్టర్ సుధాకర్ అంశం. ఆయన ఎన్- 95 మాస్కులు లేవు అన్న పాపానికి ఆయనపైపోలీసులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో మీడియాలో అందరూ చూసారు. ఆయన గనుక తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆయనకు శిక్ష పడాల్సిందే. అందులో ఎటువంటి సంకోచం లేదు.ఆయన మాట్లాడిన తీరు సైతం కొంత అభ్యంతకరంగా ఉండవచ్చు. కానీ ఆయన చొక్కా చించి రోడ్డుపై అలా పోలీసులు ప్రవర్తించడం నిజంగా శోచనీయం. దీనిపై హై కోర్టు ఒక లఖను ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణించిసిబిఐని విచారం చేయవలిసిందిగా ఆదేశించింది. ఈ విషయంలోప్రస్తుతం సిబిఐ విచారణ సాగుతున్నందున అది ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.
undefined
click me!