ఆ కథేంటో చూస్తే, చిరంజీవి ఫస్ట్ సినిమా విడుదలకు ముందు ఏ పాట వినిపించినా, ఎవరైనా డాన్సు వేయాలని చెప్పినా మరో ఆలోచన లేకుండా డాన్సులతో ఇరగదీసేవారట. మ్యూజిక్ రిథమ్ ని బట్టి డాన్స్ చేసేవాడట. కొత్త కొత్త స్టెప్పులతో ఇంప్రెస్ చేసేవాడట. కళ్లల్లో ఏదో పవర్ ఉండేదట.
ఆ చూపులు చూస్తుంటే నెగటివ్ రోల్స్ కి యాప్ట్ అని, ఇతను భవిష్యత్లో మంచి విలన్ అవుతాడని కృష్ణంరాజు అన్నారట. అయితే విలన్ ఏంటి అండి, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి అని మురళీ మోహన్ అనుకున్నారట. ఇదంతా `మనవూరి పాండవులు` సినిమా టైమ్ లో జరిగిన చర్చ.