తెలంగాణాలో ఈటల రాజేందర్ వ్యవహారం కరోనా వేళ కూడా హెడ్ లైన్ అంశంగా మారిపోయింది. ఈ మొత్తం వ్యవహారం కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగ అనిపించకమానదు. తొలుత ఆరోపణలు వచ్చాయని ఒక వర్గం మీడియా మాత్రమే కథనాలను ప్రచురించడం, ఆ వెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఈటల దమ్ముంటే నన్ను తొలగించండి అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేయడం, తరువాతి రోజు కేసీఆర్ ఆయనను వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలను తప్పించారు. నెక్స్ట్ ఏమిటి అనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
undefined
ప్రస్తుతం తెరాస అధినాయకుడు కేసీఆర్ కి ఈటల కు మధ్య నెలకొన్న అగాధం పూడవలేనిదిగా రోజురోజుకి మారిపోతుంది. వారు ఇద్దరు కలవడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఈటల నెక్స్ట్ ఏమి చేస్తారు. పార్టీ మారతారా లేదా నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా అని అందరూ చర్చించుకుంటున్నారు.
undefined
ఈటల పార్టీ మారే ఉద్దేశం లేదు అని చెప్పినప్పటికీ.... అది త్వరలో జరగబోయే విషయమే. ఆయన వేరే పార్టీలోకి వెళదాము అనుకుంటే ఆయనకు కనబడుతున్న రెండు ఆప్షన్స్ బీజేపీ, కాంగ్రెస్. కానీ ఈ రెండు పార్టీల్లోకి వెళ్లినప్పటికీ... ఈటలకి సముచిత స్థానం దక్కుతుందా అనేది డౌట్. బీజేపీలోకి వెళ్లినప్పటికీ... ఈటల బండి సంజయ్ ప్రెస్ మీట్ లో పక్కన కూర్చొవాలిసిందే తప్పితే ఆయనకు ఇక్కడునంత స్వేచ్ఛ, గుర్తింపు మాత్రం దక్కవు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు బీజేపీలోకి వెళదామనుకొని ఆగిపోవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నాగం జనార్ధనరెడ్డి వంటి వారు వెళ్లి ఇమడలేక బయటకు వచ్చారు.
undefined
పార్టీ పరంగా చూసుకున్నా బీజేపీకి మొదట్లో ఉన్నంత జోష్ ఇప్పుడు లేదు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం, ఆ తరువాత దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో తామే ప్రత్యామ్నాయం అని బీరాలు పలికినప్పటికీ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో డిపాజిట్ దక్కితే చాలు అనుకునే స్థితి. మునిసిపల్ ఎన్నికల్లో కూడా ప్రభావం నామమాత్రమే.
undefined
పోనీ కాంగ్రెస్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమి లేదు. కాంగ్రెస్ కి క్యాడర్ ఉన్నప్పటికీ... సరైన నాయకత్వం లేదు. అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలతో పార్టీకి నాయకుడు దిక్కు లేకుండా పోయాడు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు పార్టీని వీడి బయటకు వచ్చారు. పార్టీ నుండి వలసలు ఏ స్థాయిలో జరిగాయో మనమందరం చూసాము కూడా.
undefined
ఇక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి. ఆయన మాట్లాడుతూ తాను 100 కోట్ల బ్యాంకు ఋణం తీసుకునే స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఆయనకు ఆర్ధిక వనరుల కొరత లేదనేది సుస్పష్టం. దానికి తోడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని, ఈటల, హరీష్ వంటి వారు బయటకు వస్తే తాను కలిసి పనిచేస్తాను అని అన్నాడు.
undefined
దీన్ని బట్టి ఈటల కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతుంది. బలమైన బీసీ సామాజికవర్గ నేత అవడం, ఆయనకంటూ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉండడం, అంగ బలం, అర్థ బలం రెండు ఉండడం ఇక్కడ కలిసొచ్చే అంశాలు. ఆయన గనుక బయటకు వస్తే తెరాస నుంచి బీజేపీలోకి వెళ్లలేక ఉండిపోయిన వారు, కాంగ్రెస్ లోని మరికొందరు కూడా వచ్చి చేరే ఆస్కారం లేకపోలేదు. దానికి తోడు ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం వల్ల ఆయన పార్టీని ఒక కొలిక్కి తీసుకువచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు. కానీ ఇక్కడే కేసీఆర్ అన్న ఒక మాటను కూడా మర్చిపోవద్దు. పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే షర్మిల ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో మరొక పార్టీ కూడా వస్తే అది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందనేది వేచి చూడాలి.
undefined