సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మొత్తంగా 25 మంది బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు బయటపెట్టింది. ఇందులో.... సారాఅలీ ఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబాటా, టాలీవుడ్హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటకు వచ్చాయి.
undefined
రకుల్, సారా, తాను, సుశాంత్ కలిసి కూర్చొని మాదక ద్రవ్యాలు సేవించేవారమని రియా చక్రవర్తి అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్టు తెలియవస్తుంది. ఒక్కసారిగా ముగ్గురి పేర్లు బయటకు రావడంతో.... మిగిలిన ఆ 22 మంది పేర్లు ఎవరివి అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
undefined
అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ ప్రకంపనలు కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమవలేదు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు అందులో బయటపడడం, ఆమెను విచారణకు హాజరుకమ్మని ఆదేశించడంతో.... టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి.
undefined
ఈ పరిణామాలను గనుక కొన్ని రోజుల కింద నుండి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం అంటూ మాధవి లతా చేస్తున్న వ్యాఖ్యలతో కలిపిపరిశీలించి చూసుకుంటే.... ఇదేదోపెద్ద వ్యవహారం లాగానే కనబడుతుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ. మాధవి లత బీజేపీ నేత. రకుల్ టాలీవుడ్ సెలబ్రిటీ.
undefined
ఈ అన్ని సంఘటనలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ... కలిపి చూడగలిగితే మాత్రం ఒక క్లియర్ పిక్చర్ మనకు కనబడుతుంది. ఒక వేళ రకుల్ ప్రీత్ ను విచారిస్తే టాలీవుడ్ సెలెబ్రెటీల్లో ఎందరి పేర్లు బయటకు వస్తాయో మనకు తెలీదు. అప్పట్లో తెలంగాణలో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ ఏ స్థాయిలో జరిగిందో మనందరికీ తెలిసిందే.
undefined
కొంత కలం వరకు వరుస విచారణలతో కాక పుట్టించిన ఆ విషయం ఆ తరువాత లైం లైట్ లో నుంచి తొలిగిపోయింది. ఏ విషయమైనా కొన్ని రోజుల సెన్సేషన్ తరువాత మరుగున పడిపోవడం సహజం. ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ గనుక జరిపి అంధులకో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తే.... అది తెలంగాణ సర్కారును ఇరకాటంలో పెట్టడానికి బీజేపీకి మంచి ఆయుధమవుతుంది.
undefined
మరికొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ ని హ్యాండిల్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ అనేక విమర్శలు వస్తున్నాయి. కోర్టులు, కేంద్రం వరుసగా అక్షింతలు చల్లుతున్న వేళ ప్రజల్లో ఈ అభిప్రాయం ఎంతో కొంత మేర అయితే నాటుకుపోయింది.
undefined
సామాన్య ప్రజల్లోకి అది పూర్తిస్థాయిలో వెళ్లకపోయినప్పటికీ.... వోకల్ సెక్షన్స్ అయిన నగర ప్రజల్లో ఇది ఎంతోకొంత మేర కనబడుతుంది. దీనికి తోడు ఈ డ్రగ్స్ విషయాన్నికూడా గనుక బీజేపీ ఎత్తుకుంటే..... తెలంగాణలో కేసీఆర్ సర్కారును ఇరకాటంలో పెట్టడానికి బీజేపీకి వీలవుతుంది.
undefined
గ్రేటర్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకమైనవి. తెలంగాణలో జెండా పాతాలని కలలు గంటున్న బీజేపీకి ఈ ఎన్నికలు చావో రేవో వంటివి. ఇందులో ప్రభావం చూపితేనే.... తమకొచ్చిన నాలుగుపార్లమెంటు సీట్లు గాలివాటున వచ్చినవి కావని, తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం తామే అని చెప్పే వీలుంటుంది. ఒకరకంగా ఇది బలుపో, వాపో తేలిపోద్ది.
undefined
కేవలం తెలంగాణలోనే కాదు దీని ఎఫెక్ట్ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉండనుంది. గ్రేటర్ పరిధిలో సీమాంధ్ర వాసులు అధికం. ఇక్కడ బీజేపీ ప్రదర్శన భవిష్యత్తులో ఏపీలో బీజేపీ పార్టీగా నిలదొక్కుకోగలదో లేదో తేల్చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ డ్రగ్స్ కేసులో బయటకొచ్చే విషయాలు ఇప్పుడు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి.
undefined
ఇక రానున్న కొద్దీ రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖుల్లో ఇందుకు సంబంధించిన గుబులు కనిపించనుంది. బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలను చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల ముందు సాగుతున్న రియా, రకుల్ ల విచారణ ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది.
undefined