బ‌య‌ట తిన‌డాన్ని త‌గ్గిస్తోన్న మిడిల్ క్లాస్‌.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?

Published : Sep 03, 2025, 12:35 PM IST

ఇంట్లో ఎన్ని ర‌కాల వంట‌లు చేసుకున్నా నెల‌కు ఒక్క‌సారైనా అలా బ‌య‌ట ఫుడ్ తినాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. మిడిల్ క్లాస్ వాళ్లు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే ప్ర‌స్తుతం ఇందులో మార్పు క‌నిపిస్తోంది. 

PREV
15
హోట‌ల్స్‌లో తినే వారి సంఖ్య త‌గ్గుతోంది

ద్రవ్యోల్బణం ఇటీవల తక్కువైనప్పటికీ, భారత మధ్యతరగతి కుటుంబాలు బయట తినడాన్ని తగ్గిస్తున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల (QSRs) పై పడుతోంది. హోటళ్లలో కూర్చొని తినే వారి సంఖ్య తగ్గగా, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మాత్రం బలంగా నిలుస్తోంది. డొమినోస్, పిజ్జా హట్, బార్బెక్యూ నేషన్ వంటి చైన్‌లు ఈ మార్పును స్పష్టంగా చూస్తున్నాయి.

25
డైన్-ఇన్ సంఖ్యలు తగ్గిపోవడంతో నష్టాలు

ఈ ఏడాది జూన్‌లో చాలా QSR చైన్‌లకు డైన్-ఇన్ కస్టమర్లు తగ్గిపోయారు. అయితే డొమినోస్ మాత్రం డెలివరీపై దృష్టి పెట్టి లాభాలు చూసింది. దాదాపు 75% ఆర్డర్లు డెలివరీ ద్వారా వచ్చాయి. కానీ పిజ్జా హట్, బార్బిక్యూనేషన్ వంటి బ్రాండ్‌ల ఆదాయం త‌గ్గిపోయింది. బార్బీక్యూ నేష‌న్ ఆదాయం 7 శాతం త‌గ్గిపోయింది.

35
RBI సర్వేలో ఆసక్తిర విష‌యాలు

భారత రిజర్వ్ బ్యాంక్ సర్వే ప్రకారం, 60% మందికి పైగా వినియోగదారులు ఈ ఏడాది బయట తినడంపై ఖర్చు తగ్గిస్తామ‌ని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు సాధారణ రెస్టారెంట్లలో తినడం తగ్గించినా, పంజాబ్ గ్రిల్ లాంటి హైఎండ్ రెస్టారెంట్లలో మాత్రం వెళ్తున్నారు.

45
పెరిగిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల గ్రోత్

జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు జూన్ క్వార్టర్‌లో 16–19% వృద్ధి సాధించాయి. దీనికి అనుగుణంగా చాలా QSRలు ఇప్పుడు దుకాణాల పరిమాణం తగ్గించి డెలివరీపై ఎక్కువ దృష్టి పెట్టుతున్నాయి.

55
భవిష్యత్తులో మార్పులు?

త్వరలో జరగనున్న GST కౌన్సిల్ సమావేశంలో ఈ రెస్టారెంట్ చైన్‌ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గితే కస్టమర్లకు కూడా కొంత ఉపశమనం లభించొచ్చు. అంటే మీ ఫేవరెట్ టేక్ అవే స్పాట్ భవిష్యత్తులో మరింత అఫోర్డబుల్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories