ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా భావువాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై ఓ కింగ్ కోబ్రా దాడి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోని ఒక ఇంటి ముందు గోడపై ఉన్న చెట్ల పొదల్లో కింగ్ కోబ్రాను అక్కడి ప్రజలు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.