తెలుగు రాష్ట్రాలకు సాధారణం కంటే త్వరగానే రుతుపవనాలు
రుతుపవనాలు అండమాన్ తీరం చేరాయి. ఈ నెల చివరికల్లా కేరళ తీరానికి చేరుకోనున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈ శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా ఉండగా, రాయలసీమ, తీర ప్రాంతాల్లో గాలివానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలు ఉన్నాయి.