Summer Holidays : వేసవి సెలవులు వచ్చాయంటే చాలామంది విద్యార్థులకు మామూలు ఆనందం కాదు. స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు... చదువుల ఒత్తిడి, పరీక్షల టెన్షన్ ఉండదు... క్లాస్ వర్క్ లు, హోంవర్క్ లు చేయాల్సిన అవసరం ఉండదు... హాయిగా కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపవచ్చు. ఇక సొంతూరికి వెళ్లి నాన్నమ్మ వాళ్ల ఇంట్లో లేదంటే అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఎంజాయ్ చేయవచ్చు... ఇలా పట్నాల్లోని పిల్లలు పల్లెటూళ్లలో సరదాగా గడుపుతారు. అందుకే వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వేసవి సెలవులు సగం ముగిసాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు చాలా ముందుగానే వేసవి సెలవులు వచ్చాయి... మిగతా తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 24 నుండి సెలవులు ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేట్ స్కూళ్లకు జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి.. జూన్ 12న తిరిగి ప్రారంభం అవుతాయి. అంటే 46 రోజులపాటు విద్యార్థులకు సెలవులు కొనసాగుతాయన్నమాట.