Viral Video: సోషల్ మీడియా యుగంలో ఎలాగైనా పాపులర్ అవ్వాలని చాలా మంది కోరకుంటున్నారు. ఇందుకోసం ఏదైనా చేస్తున్నారు. ఆజాగా ఓ మహిళ చేసిన పనకి నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంతకా వీడియోలో ఏముందంటే.?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ స్కూటర్ డిక్కీ తెరిచి, అందులో చిన్నారిని పెట్టినట్టు కనిపిస్తోంది. ఆ సమయంలో బిడ్డ నిద్రలో ఉన్నట్టు వీడియోలో ఉంది. ఆ తర్వాత మహిళ డిక్కీ మూసి, స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్లిపోయినట్టు క్లిప్‌లో కనిపిస్తుంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బిడ్డ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
24
నెటిజన్లు ఆగ్రహాం
బిడ్డను డిక్కీలో పెట్టిన తర్వాత స్కూటర్‌పై వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కేవలం వ్యూస్, లైక్స్ కోసమే రూపొందించారని స్పష్టమవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ పిచ్చి కోసం చిన్నారి ప్రాణాలను పణంగా పెడుతారా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
34
ఈ వీడియో నిజమేనా? ఎడిట్ చేశారా.?
ఇదిలా ఉంటే ఈ వీడియోను ఎడిట్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. వీడియోలో ఒక చోట కట్ కనిపిస్తున్నట్టు ఉంది. అంటే స్కూటర్ ఆన్ చేసుకుని వెళ్లే ముందు మహిళ బిడ్డను బయటకు తీసి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. నిజంగా బిడ్డను డిక్కీలో పెట్టి వెళ్లిందా లేక వీడియో కోసం మాత్రమే అలా చూపించిందా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
ఈ ఘటనపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. రీల్స్, లైక్స్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం చాలా తప్పని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. “రీల్స్ కోసం ఇంత వరకు వెళ్తారా?” అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు “రీల్ చేయాలనే మోజు మనుషులను ఎంతవరకు తీసుకెళ్తుందో ఇదే ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.