క‌లికాలం కాక‌పోతే ఏంటిది.? వైన్స్ షాప్‌లో మ‌ద్యం కొంటున్న విద్యార్థినులు. వైర‌ల్ వీడియో..

Published : Oct 30, 2025, 07:17 AM IST

Viral Video: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మండ్లా జిల్లాలో ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. స్కూల్ యూనిఫారమ్ వేసుకున్న బాలికలు వైన్స్ షాప్‌కి వెళ్లి మ‌ద్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. 

PREV
14
సీసీటీవీలో రికార్డ్

నైన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ మద్యం షాప్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. వీడియోలో యూనిఫారమ్‌లో ఉన్న బాలికలు ముఖం కొంత భాగం స్కార్ఫ్‌లతో కప్పుకుని వైన్స్ షాప్‌లోకి వ‌చ్చారు. కౌంటర్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి వెళ్లిపోయారు. షాప్ నిర్వాహ‌కులు కూడా విద్యార్థినుల అని కూడా చూడ‌కుండా మ‌ద్యాన్ని విక్ర‌యించ‌డం ఆశ్చ‌ర్యం.

24
విచార‌ణ ప్రారంభించిన అధికారులు

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దుకాణాన్ని పరిశీలించారు. సీసీటీవీ వీడియోను ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పరిశీలించి, బాలికలకు మద్యం విక్రయం జరిగినట్టు నిర్ధారించారు. ఇది చట్ట విరుద్ధమని తేలింది.

34
చట్టపరమైన చర్యలు, లైసెన్స్ రద్దు సూచన

ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా, అధికారులు ఎక్సైజ్ శాఖకు వివరమైన నివేదికతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుకాణ యజమాని, సిబ్బందిని విచారిస్తున్నారు. బాలికలు స్వయంగా వచ్చారా లేదా ఎవరి ప్రేరణతో వచ్చారా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. జిల్లా ఎక్సైజ్ అధికారి రాంజీ పాండే మాట్లాడుతూ.. “బాలికలకు మద్యం అమ్మడం లైసెన్స్ నిబంధనలకు విరుద్ధం. ఈ దుకాణం లైసెన్స్ రద్దు చేసి, సంబంధిత ఉద్యోగిని తొలగిస్తాం,” అని తెలిపారు.

44
రాజ‌కీయ విమ‌ర్శ‌లు

ఈ ఘటన మండ్లాలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ప్రజలు దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు క‌లికాలం అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైర‌ల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read more Photos on
click me!

Recommended Stories