Bus Accident : నిన్న కర్నూల్, నేడు రాజస్థాన్… వరుస ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బస్సులను నిషేంధించాలనే డిమాండ్ మొదలయ్యింది.
Bus Accident : కర్నూల్ బస్సు ప్రమాద ఘటనను మరిచిపోకముందే మరో ట్రావెల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్-డిల్లీ జాతీయ రహదారిపై బస్సు మంటల్లో చిక్కుకుని ముగ్గురు కార్మికులు సజీవదహనం అయ్యారు... మరో 10 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జైపూర్ కు తరతించారు.
25
ప్రమాదం ఎలా జరిగింది?
ఉత్తర ప్రదేశ్ నుండి కొందరు ఇటుక బట్టీ కార్మికులను తరలిస్తుండగా జైపూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... వెంటనే కొందరు కార్మికులు అప్రమత్తమై బస్సులోంచి దిగిపోయారు. కానీ కర్నూల్ అగ్నిప్రమాదం మాదిరిగా క్షణాల్లో బస్సు మొత్తాన్ని మంటలు అంటుకున్నాయి... దీంతో కొందరు ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
35
ట్రావెల్స్ బస్సులను నిషేధించాలి : ఇండియన్ ఆయిల్ మాజీ ఛైర్మన్
వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో ఇందులో ప్రయాణమంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. మరి ఇన్ని ఘటనలు జరుగుతున్నా... ఇంతమంది ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదు? ట్రావెల్స్ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? రక్షణ చర్యలు ఎందుకు చేపట్టడంలేదనే ప్రశ్నలు తలెతున్నాయి. ఈ క్రమంలో దేశంలో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించాలని మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య ఆసక్తికరమైన డిమాండ్ చేస్తున్నారు.
మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య లింక్డ్‌ఇన్‌లో వరుస బస్సు ప్రమాదాలపై స్పందించారు. “భారత్‌లో స్లీపర్ బస్సులు ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేశాయి. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలే దీనికి నిదర్శనం. ఇది పూర్తిగా బాధ్యతారహితమైన బస్సుల డిజైన్ ఫలితమే” అని పేర్కొన్నారు.
''ఇటీవల కొద్ది కాలంలోనే జరిగిన బస్సు ప్రమాదాల్లో 41 మంది చనిపోయారు. కర్నూలులో 19 మంది, రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో 20 మంది. గత 10 ఏళ్లలో స్లీపర్ బస్సుల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో 130 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దురదృష్టం కాదు… బస్సుల డిజైన్ వల్ల జరిగిన పెద్ద తప్పు'' అని శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
55
చైనా మాదిరిగా భారత్ ఎందుకు చేయడంలేదు?
''ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని దేశాలు ప్రయాణికుల భద్రత కోసం ట్రావెల్స్ బస్సుల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నాయి. చైనాలో 2012లోనే స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించారు. వియత్నాంలో భద్రతా నియమాలను, ఎగ్జిట్ సిస్టమ్‌లను మార్చారు. జర్మనీలో తక్కువ సామర్థ్యంతో కూడిన నియంత్రిత డిజైన్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఈ ఘటనలు జరిగిన తర్వాత విచారణ జరపడం మాత్రమే కొనసాగిస్తోంది. పూర్తిస్థాయి భద్రతా చర్యలు ఇప్పుడు అవసరం. 1.6 మిలియన్ బస్సులు, ప్రైవేట్ ఆపరేటర్ వ్యవస్థ వల్ల ప్రయాణికుల భద్రతకు పర్యవేక్షణ లేకుండా పోయింది'' అంటూ మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
''అధిక రద్దీ, అక్రమ విద్యుత్ కనెక్షన్లు వంటి అనేక కారణాలతో స్లీపర్ బస్సులు ప్రయాణికులను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి ఏకైక పరిష్కారం ప్రస్తుత రూపంలో ఉన్న స్లీపర్ బస్సులను భారత్‌లో పూర్తిగా నిషేధించడమే” అని మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య పేర్కొన్నారు. దీనికి మద్దతుగా చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.