Viral Video: కొత్తగా పెళ్లైన జంట కోసం భారతీయ రైల్వే ఫస్ట్ ఏసీ కూపే (చిన్న క్యాబీన్)ను పూలు, బెలూన్లు, లైట్లు, ప్రత్యేక అలంకరణతో హనీమూన్ సూట్‌లా మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట కొత్చ చర్చకు తెర తీసింది.
రైలులో కూపే (Coupe) అంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించడానికి వీలుగా ఉండే ఒక ప్రత్యేకమైన చిన్న క్యాబిన్. వైరల్ అవుతోన్న వీడియోలో ఫస్ట్ ఏసీ రెండు బెర్త్‌ల కూపేను పూర్తిగా కొత్త రూపంలో అలంకరించారు. గోడలకు ఎరుపు రంగు కర్టెన్లు, పసుపు రంగు ఫెయిరీ లైట్లు, హార్ట్ షేప్‌లోని బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. రైల్వే అందించే బెడ్‌షీట్లు, దుప్పట్ల స్థానంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన బెడ్‌షీట్లను ఉపయోగించారు. వాటిపై గులాబీ రేకులు చల్లారు. ఇలా ట్రైన్ బోగిలో రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించారు.
25
వీడియో వైరల్.. రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు కొత్త జంట కోసం చేసిన ఈ ప్రత్యేక ఏర్పాటును అభినందిస్తూ, ప్రయాణాన్ని మరపురాని అనుభూతిగా మార్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రజా రవాణా వాహనాన్ని వ్యక్తిగత వేడుకల కోసం ఇలా మార్చడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. రైల్వే కోచ్‌ను హోటల్ గదిలా అలంకరించడం నిబంధనలకు విరుద్ధమని కొందరు విమర్శిస్తున్నారు.
35
భద్రతపై వ్యక్తమైన ఆందోళనలు
ఈ అలంకరణలో విద్యుత్ లైట్లు, అదనపు వస్త్రాలు, ఇతర అలంకరణ సామగ్రిని ఉపయోగించడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రయాణం ముగిసిన తర్వాత బెలూన్లు, పూలు, ఇతర అలంకరణ వస్తువులను అక్కడే వదిలేస్తే శుభ్రత సమస్యలు తలెత్తుతాయని కూడా వ్యాఖ్యానించారు. ప్రజా ఆస్తిని ఉపయోగించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు సూచించారు.
మరోవైపు, ఆ జంటకు సపోర్ట్‌గా కూడా చాలా మంది స్పందించారు. వారు కూపే తలుపు మూసుకుని తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదిస్తారని, ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని అభిప్రాయపడ్డారు. కొంతమంది అయితే హోటల్ కంటే ఇలాంటి ప్రయాణ అనుభవమే మరింత ప్రత్యేకంగా ఉంటుందని, కొత్త జీవితాన్ని ప్రారంభించే జంటకు ఇది మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
I don’t know if this is legal to do but lord please keep dehatis away from first AC.
Railways has only this left as a decent option to travel. They have penetrated inside Vande Bharat too.
No mood to fight dehatism even in First AC now. Suhagraat tourism wasn’t on 2026 cards. pic.twitter.com/aMI7CODhDd
— Siddharth's Echelon (@SiddharthKG7) July 8, 2026
55
రైల్వే నుంచి ఇంకా స్పందన లేదు
ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతున్నప్పటికీ, దీనిపై భారతీయ రైల్వే నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రజా ఆస్తి వినియోగం, భద్రతా నిబంధనలు, అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన నిబంధనలు రైల్వేలో అమల్లో ఉన్నప్పటికీ, ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత లేదు. ఈ వైరల్ వీడియోతో వ్యక్తిగత వేడుకలకు హద్దులు ఎక్కడ ఉండాలి? ప్రజా ఆస్తిని ఎలా వినియోగించాలి? భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఈ రైలుకు ఎక్కడిది.? ఈ సంఘటన ఎక్కడ జరిగింది.? అన్న వివరాలు మాత్రం తెలియలేదు.