Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే

Published : Dec 13, 2025, 12:04 PM IST

Viral News: విభిన్న సంస్కృతులు, మ‌తాల‌కు, ఆచారాల‌కు పెట్టింది పేరు భార‌త‌దేశం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. అయితే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఓ కుగ్రామంలో ఉన్న వింత ఆచారం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. 

PREV
15
ఆశ్చర్యకర సంప్రదాయం

భారతదేశం అనేక సంస్కృతులు, ఆచారాలకు నిలయం. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ చాలా పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కుల్లు జిల్లాలోని పిని గ్రామం అలాంటి ప్రాంతాల్లో ఒకటి. అక్కడ ఏటా జరిగే ఓ పండుగ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

25
ఐదు రోజుల ప్రత్యేక పండుగ

పిని గ్రామంలో సావన్ మాసంలో ఐదు రోజుల పాటు ఓ ప్రత్యేక పండుగ నిర్వహిస్తారు. ఈ కాలంలో గ్రామ మహిళలు దుస్తులు ధ‌రించ‌రు. అయితే ఈ ఐదు రోజులు వారు ఇళ్లలోనే ఉంటారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రారు. పురుషులు మ‌హిళ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం కూడా నిషేధం. అంతేకాకుండా ఈ ఐదు రోజులు మహిళలు న‌వ్వ‌డం కూడా చేయ‌రు.

35
సంప్రదాయం వెనుక కథ

ఈ పండుగ వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. లాహు ఘోండ్ అనే దేవుడు భాద్రపద మాసం మొదటి రోజున ఓ రాక్షసుణ్ని సంహరించాడని నమ్మకం. ఆ రాక్షసుడు మహిళల గౌరవాన్ని హరించాడని, వారి దుస్తులు చింపేశాడని కథ చెబుతుంది. ఆ సంఘటన జ్ఞాపకార్థంగా ఈ సంప్రదాయం మొదలైందని గ్రామస్తుల విశ్వాసం.

45
పాటించాల్సిన కఠిన నియమాలు

మహిళలు దుస్తులు ధరించకుండా ఉన్నా, తమ శరీరాన్ని కప్పుకోవడానికి గొర్రె ఉన్నితో చేసిన పట్టాలు ఉపయోగిస్తారు. ఈ సమయంలో భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోరు. పురుషులకు కూడా నియమాలు ఉన్నాయి. వారు ఆల్కహాల్ సేవించకూడదు, మాంసాహారం తీసుకోకూడదు. సంప్రదాయం ఉల్లంఘిస్తే దేవతలు కోపానికి గురికావాల్సి వ‌స్త్ఉంద‌ని గ్రామస్తుల నమ్మకం.

55
కాలంతో మారుతున్న ఆచారం

ఇటీవలి కాలంలో కొంత మార్పు కనిపిస్తోంది. యువతరం మహిళల్లో కొందరు ఈ పండుగ సమయంలో చాలా పలుచని దుస్తులు ధరిస్తున్నారు. అయితే పెద్దవయసు మహిళలు ఇప్పటికీ పాత సంప్రదాయాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. ఆధునిక ఆలోచనలు పెరుగుతున్నా, ఈ గ్రామంలో ఈ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories