ఇలాంటి తండ్రి ఉంటే ప్ర‌తీ కొడుకు క‌ల నిజ‌మ‌వుతుంది.. వైర‌ల్ అవుతోన్న క్యూఆర్ కోడ్

Published : Nov 02, 2025, 06:50 AM IST

Viral News: సాధార‌ణంగా ఏ తండ్రి అయినా త‌న కొడుకు ఏ ఇంజ‌నీర్ లేదా డాక్ట‌ర్ కావాల‌ని కోరుకుంటారు. మ‌రీ ముఖ్యంగా భార‌త్‌లో పేరెంట్స్ ఆలోచ‌న ఇలాగే ఉంటుంది. అయితే ముంబయికి చెందిన ఓ తండ్రి చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 

PREV
15
టాక్సీలో QR కోడ్

ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్ల యుగం. టాక్సీల్లో, ఆటోల్లో, దుకాణాల్లో ఎక్కడ చూసినా QR కోడ్లు కనిపిస్తాయి. ప్రయాణం పూర్తయ్యాక స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం ఇప్పుడు సాధారణం. కానీ ముంబయిలో ఓ యువతికి ఓ టాక్సీలో కనిపించిన QR కోడ్ మాత్రం వేరే కథ చెప్పింది.

25
విచిత్రమైన QR కోడ్

దివ్యుషి సిన్హా అనే యువతి ఒక లోకల్ బ్లాక్ అండ్ యెల్లో టాక్సీలో ప్రయాణం చేస్తుండగా ముందు సీటుపై ఒక QR కోడ్ కనిపించింది. దాన్ని చూసి పేమెంట్ కోడ్ అనుకుని డ్రైవర్‌ను అడిగింది. కానీ డ్రైవర్ ఇచ్చిన సమాధానం ఆమెను ఆశ్చర్యపరిచింది.

35
డ్రైవర్ చెప్పిన కథ

“అది పేమెంట్ కోసం కాదు మేడం, నా కొడుకు యూట్యూబ్ చానల్‌కి సంబంధించిన QR కోడ్!” అని డ్రైవర్ చెప్పాడు. అతని కొడుకు రాప్ మ్యూజిక్ చేసే యూట్యూబర్ అని వివరించాడు. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా అతని యూట్యూబ్ పేజీకి వెళ్తుందట.

45
చానల్ వెనుక ఉన్న క్రియేటివిటీ

QR కోడ్ పక్కన ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది.. “హలో, నేను రాజ్‌. ఈ టాక్సీ డ్రైవర్ నా నాన్న. నేను ర్యాప్‌ మ్యూజిక్ చేస్తాను. ఈ QR కోడ్ స్కాన్ చేసి నా యూట్యూబ్ చానల్‌కి వెళ్లండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు!” అంటూ రాసి ఉంది.

55
సోషల్ మీడియాలో వైరల్

దివ్యుషి ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఈ ఆలోచన అద్భుతమని, స్ఫూర్తిదాయకమని చెప్పింది. పోస్టులో ఆమె టాక్సీలో ఉన్న QR కోడ్ ఫోటోను కూడా పెట్టింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. “ఇది నిజంగా క్రియేటివ్ ఐడియా”, “తండ్రి, కొడుకుల బంధానికి మంచి ఉదాహరణ” అంటూ నెటిజన్లు ప్రశంసించారు. నిజంగా ఇలాంటి తండ్రి ఉంటే ప్ర‌తీ కొడుకు ఒక ర్యాప్ సింగ‌ర్ అవుతారు అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories