చిన్నగ్రామం నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరకు.. జస్టిస్ సూర్యకాంత్ సక్సెస్ జర్నీ

Published : Oct 30, 2025, 09:49 PM IST

Justice Surya Kant : మారుమూల గ్రామంనుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు జస్టిస్ సూర్యకాంత్. ఆయనది ఆదర్శవంతమైన సక్సెస్ జర్నీ.

PREV
14
సుప్రీంకోర్టు నూతన సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్

Supreme Court Chief Justice Surya Kant : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ప్రస్తుత CJI జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23, 2025 తో ముగియనుంది... దీంతో నూతన సిజెఐ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం సిజెఐ నేతృత్వంలోని కొలిజియం సిపారసు మేరకు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ను తదుపరి చీప్ జస్టిస్ గా నియమించారు... ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నూతన సిజెఐ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నుండి బాధ్యతలు స్వీకరించి నవంబర్ 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9న ఈయన పదవీకాలం ముగియనుంది.

24
ఎవరీ జస్టిస్ సూర్యకాంత్

నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన జస్టిస్ సూర్యకాంత్ స్వస్థలం హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వార్ గ్రామం. మారుమూల పల్లెటూరిలో 1962 ఫిబ్రవరి 10న అత్యంత సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా స్వస్థలంలోనే సాగింది... హిసార్ లోని ప్రభుత్వ కాలేజీలో పిజి పూర్తిచేసాక న్యాయశాస్త్రంపై ఆసక్తితో రోహ్ తక్ చేరుకున్నారు... ఇదే సాధారణ యువకుడిని కాస్త దేశ అత్యన్నత న్యాయస్థానం వరకు నడిపించి జస్టిస్ సూర్యకాంత్ ను... ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను చేసింది.

రోహ్ తక్ లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి 1984లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఇలా ప్రారంభమైన ఆయన జర్నీ అనేక పదవులను అదిరోహిస్తూ సిజెఐ వరకు సాగింది.

34
జస్టిస్ సూర్యకాంత్ కెరీర్

1984 లో సాధారణ న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత్ 2000 లో హర్యానా అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు. అతి చిన్న వయసులో ఈ హర్యానా AG గా పనిచేసిన రికార్డు ఈయన సొంతం. 2001 లో సీనియర్ న్యాయవాదిగా మారారు. కొన్నాళ్లకే న్యాయమూర్తిగా మారారు... 2004లో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇలా న్యాయవాది నుండి న్యాయమూర్తిగా మారిన జస్టిస్ సూర్యకాంత్ అనేక హైకోర్టుల్లో పనిచేశారు... 2018 లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2019 లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ సూర్యకాంత్. తాజాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అత్యున్నత పదవిని పొందారు. హర్యానా నుండి సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా నియమితులైన మొదటి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2027 లో సరిగ్గా తన పుట్టినరోజుకు ముందురోజు జస్టిస్ సూర్యకాంత్ పదవీ విరమణ పొందనున్నారు. సుమారు 15 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు.

44
కీలక కేసులు, తీర్పులు

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చెల్లుతుందని తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు.

వలస పాలన కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించే వరకు దీని కింద కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని తీర్పులో ఆదేశించారు.

బీహార్‌లో ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది వివరాలను బహిరంగంగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించి ఎన్నికల్లో పారదర్శకతను పెంచారు జస్టిస్ సూర్యకాంత్.

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా న్యాయవాదుల సంఘాలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ 2022 పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై విచారణకు, రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.

సైనికులకు ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ (OROP) పథకం రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని ధృవీకరించిన తీర్పును జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చారు.

పెగాసస్ స్పైవేర్ సంబంధిత కేసును విచారించిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్... "జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వలేం" అని అన్నారు. చట్టవిరుద్ధమైన నిఘా ఆరోపణలపై విచారణకు సైబర్ నిపుణుల కమిటీని నియమించారు.

Read more Photos on
click me!

Recommended Stories