Viral News: ఓ వైపు ట్రాఫిక్‌, మ‌రోవైపు గుంత‌ల రోడ్లు.. ఐటీ న‌గ‌రంపై పెరుగుతోన్న వ్య‌తిరేక‌త‌

Published : Oct 14, 2025, 12:06 PM IST

Viral News: ఇండియ‌న్ ఐటీకి కేరాఫ్ అడ్ర‌స్ ఆ న‌గ‌రం. ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఆ న‌గ‌రంలో జీవితం న‌ర‌కంతో స‌మానంగా ఉంద‌ని చాలా మంది వాపోతున్నారు. తాజాగా ఓ కంపెనీ సీఈఓ చేసిన పోస్టుతో ఈ అంశం మ‌రోసారి తెరపైకి వచ్చింది. 

PREV
15
విదేశీ అతిథి వ్యాఖ్యతో బియాకాన్ అధినేత్రి షాక్

బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఇటీవల ఓ విదేశీ వ్యాపార అతిథితో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘X’లో పంచుకున్నారు. ఆ విదేశీ అతిథి ఆమె బియాకాన్ పార్క్ కార్యాలయానికి వచ్చినప్పుడు, “ఇక్కడి రోడ్లు ఇంత చెత్తగా ఎందుకు ఉన్నాయి? ఎక్కడ చూసినా చెత్త కుప్పలు ఎందుకు కనిపిస్తున్నాయి? అని రాసుకొచ్చారు. 

25
పెట్టుబడులు వద్దా.?

అలాగే ఆమె స్పందిస్తూ.. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించాలనుకోవడం లేదా? నేను చైనా నుంచి వస్తున్నాను. అక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పోలిస్తే భారత్‌ ఎందుకు ఇంత వెనుకబడి ఉందో అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను షా తన పోస్ట్‌లో పేర్కొంటూ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ప్రియాంక్ ఖర్గే వంటి రాష్ట్ర నాయకులను ట్యాగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

35
రోడ్ల దుస్థితి కారణంగా మకాం మార్చుతున్న కంపెనీలు, నారా లోకేష్ స్పందన

గతంలో కూడా పలు కంపెనీలు బెంగళూరు రోడ్ల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసరాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో, బ్లాక్‌బక్ కంపెనీ CEO రాజేష్ యబాజీ అక్కడి నుంచి కార్యాలయాన్ని మార్చుకునే నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహందాస్ పై ఈ పరిస్థితిని “పాలనలో ఘోర వైఫల్యం” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

బ్లాక్‌బ‌క్ కంపెనీ సీఈఓ స్పందించిన స‌మ‌యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌య‌మై లోకేష్ స్పందిస్తూ.. ‘హాయ్‌ రాజేశ్, మీ కంపెనీని విశాఖకు మార్చుకునేందుకు నేను ఆసక్తి చూపిస్తున్నా. భారత్‌లోని అత్యుత్తమ ఐదు పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు ఉంది. దయచేసి నాకు నేరుగా సందేశం (డీఎం) పంపండి’ అని లోకేశ్‌ ఆయనకు సందేశాన్ని పంపించడం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

45
బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఎందుకు పెరుగుతోంది.?

బెంగళూరులోని ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులు ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం AI ఆధారిత కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడానికి ఏర్పాటు చేసినప్పటికీ, అనధికార పార్కింగ్, వన్‌వే ఉల్లంఘనలు వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాగా.. బెంగళూరులోని ఐటీ కంపెనీల ఉద్యోగులు, నివాసితులు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సూచన చేశారు. “రోడ్లు, డ్రెయినేజ్, ఫ్లైఓవర్ల మరమ్మత్తులు పూర్తయ్యే వరకు IT పార్కులను తాత్కాలికంగా మూసివేయండి” అని కోరుతున్నారు.

55
ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదా.?

మ‌రి ఈ ట్రాఫిక్ స‌మ‌స్య‌పై కర్ణాట‌క ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదా అంటే కాద‌నే స‌మాధానం చెప్పాలి. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఇప్ప‌టికే “మిషన్ ఫ్రీ ట్రాఫిక్ – 2026” పేరుతో ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించింది. దీనిలో భాగంగా, 90 రోజుల్లో 1,600 కిలోమీటర్ల రహదారుల మరమ్మత్తు, పాత గుంతల పూడ్చివేత, రోడ్ల రీ-సర్ఫేసింగ్ వంటి పనులు చేపడుతున్నారు. అదేవిధంగా, ప్రైవేట్ కంపెనీల సహకారంతో రోడ్ల పరిశుభ్రతతో పాటు నిర్వహణకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రణాళిక ద్వారా 2026 మార్చి నాటికి బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు తగ్గడం, రోడ్ల నాణ్యత మెరుగుపడటం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories