EPFO కొత్త రూల్స్ : ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Published : Oct 13, 2025, 10:19 PM IST

EPFO: కేంద్ర మంత్రి డా. మన్సుఖ్ మండావియా అధ్యక్షతన 238వ సీబీటీ సమావేశం జరిగింది. దీని తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కీలక మార్పులు ప్రకటించింది. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన మార్పులు, దీని వల్ల ఉద్యోగులకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఈపీఎఫ్ఓ లో పెద్ద మార్పులు.. డబ్బు విత్‌డ్రా మరింత సులభం

ఈపీఎఫ్ఓ ఉద్యోగుల సౌలభ్యం కోసం చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం 13 రకాల కాంప్లెక్స్ విత్‌డ్రా రూల్స్‌ను మూడు ప్రధాన విభాగాల్లో సరళీకృతం చేశారు. దీంతో తమ అకౌంట్ల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవడం మరింత సులభంగా మారింది. 1. రోగాలు, విద్య, వివాహ అవసరాల కోసం 2. హౌసింగ్ అవసరాలు, 3. ప్రత్యేక పరిస్థితులు మూడు విభాగాలుగా ఉన్నాయి.

ఇప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులు 100% వరకు మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి, ఎంప్లాయర్ భాగస్వామ్యం కలిపి ఉంటుంది. విద్యకు 10 రెట్లు, వివాహానికి 5 రెట్లు పరిమితిని పెంచారు. అన్ని పాక్షిక విత్ డ్రాలకు 12 నెలల కనీస సర్వీస్ మార్పులు తీసుకొచ్చారు. 

ప్రత్యేక పరిస్థితులలో, విత్‌డ్రా కోసం కారణం చెప్పాల్సిన అవసరం లేదు, దాంతో రిజెక్షన్ తగ్గుతుంది. రిటైర్మెంట్ కారణాలతో 25% ఖాతా బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలనే మార్పులు చేశారు. వార్షికంగా 8.25% వడ్డీ కొనసాగుతుంది. ఈ మార్పులు 100% ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ను అందిస్తాయి.

25
కొత్తగా తీసుకొచ్చిన విశ్వాస్ స్కీమ్ ప్రయోజనాలు ఏంటి?

ఈపీఎఫ్ఓ కీలక మార్పులలో భాగంగా విశ్వాస్ స్కీమ్ ను కొత్తగా తీసుకొచ్చింది. ఆలస్యంగా పీఎఫ్ డిపాజిట్ చేసిన సంస్థలపై ఉన్న పెనాల్టీ కేసులను పరిష్కరించడానికి దీనిని తీసుకొచ్చారు. మే 2025 నాటికి ఈపీఎఫ్ఓ వద్ద ₹2,406 కోట్ల విలువైన పెండింగ్ పెనాల్టీ కేసులు ఉన్నాయి. విశ్వాస్ స్కీమ్ కింద, పెనాల్టీ రేటు ప్రతి నెలకు 1 శాతం గా నిర్ణయించారు. అలాగే, రెండు నెలల ఆలస్యం కోసం 0.25%, నాలుగు నెలల వరకు 0.50% రేట్లను వర్తింపజేశారు.

ఈ పథకం నాలుగు నెలల వ్యవధిలో అమలు చేస్తారు. అవసరమైతే మరో ఆరు నెలల వరకు పొడిగించవచ్చు. స్కీమ్ కింద పరిష్కరించిన ప్రతి పెండింగ్ కేసు అటోమేటిక్ గా రద్దు అవుతుంది. కార్మిక శాఖ ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం వల్ల లీగల్ కేసుల సంఖ్య తగ్గి, నియమాల అమలుకు సంబంధించిన ఖర్చులు తగ్గి, ఉద్యోగుల బకాయిలను త్వరగా రికవర్ చేయడం సాధ్యమవుతుంది.

35
పెన్షనర్ల కోసం డోర్‌స్టెప్ సర్వీసులు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తో ఈపీఎఫ్ఓ ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా EPS-95 పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సేవలు ఇంటివద్దనే లభిస్తాయి. ప్రతి సర్టిఫికేట్ ₹50 భారాన్ని ఈపీఎఫ్ఓ భరించనుంది. గ్రామీణ ప్రాంతాలతో ఉన్నవారితో పాటు అందరికీ ఇంటివద్దనే DLC వాలిడేషన్ చేసే సౌలభ్యం లభిస్తుంది. దీని వల్ల  పెన్షన్ చెల్లింపులు నిరంతరంగా కొనసాగుతాయి. సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులు తప్పుతాయి.

45
EPFO 3.0తో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్

EPFO 3.0 పరిధిలో కోర్ బ్యాంకింగ్ మోడల్, క్లౌడ్-నేటివ్, ఏపీఐ-ఫస్ట్, మైక్రోసర్వీసెస్తో సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చారు. దీని ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్లు వేగవంతం అవుతాయి. ఇన్‌స్టాంట్ విత్‌డ్రా, పేస్రోల్ లింక్ చేసిన కాంట్రిబ్యూషన్, బహుభాషా సెల్ఫ్-సర్వీస్ ఆప్షన్లు ఈజీగా మారుతాయి. ఈపీఎఫ్ఓ కొత్తగా నలుగురు పోర్ట్‌ఫోలియో మేనేజర్లను నియమించింది. దీని ద్వారా ఫండ్ మేనేజ్మెంట్, రిటర్న్స్ సేవులు మెరుగుపడతాయి.

55
ఈపీఎఫ్ఓ మార్పులతో ఉద్యోగులకు కలిగే లాభాలు
  • 100% పీఎఫ్ విత్‌డ్రా (ఎంప్లాయర్ షేర్‌తో) చేసుకోవచ్చు
  • విద్యకు 10 సార్లు, వివాహానికి 5 సార్లు పాక్షిక విత్‌డ్రా చేసుకోవచ్చు
  • కనీస సర్వీస్ ను 12 నెలలకు తగ్గించారు.
  • 25% మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనతో మెరుగైన రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందుతాయి
  • సులభమైన, పేపర్‌లెస్, ఆటోమేటిక్ క్లెయిమ్ సర్వీసులు
  • విశ్వాస్ స్కీమ్ ద్వారా కోర్టు లేదా లీగల్ కేసులు తగ్గుతాయి
  • డోర్‌స్టెప్ డీఎల్సీ పెన్షన్ సేవలు
  • డిజిటల్ EPFO 3.0 తో మరింత మెరుగైన సేవలు

మొత్తంగా ఈపీఎఫ్ఓ ఈ మార్పులతో ఆధునిక, సాంకేతికత ఆధారిత, ఉద్యోగుల సౌలభ్యమే లక్ష్యంగా ముందుకు సాగే సంస్థగా నిలుస్తుంది. ఉద్యోగులకు సులభమైన విత్‌డ్రా, పెన్షన్ సౌలభ్యం, భవిష్యత్ ఆర్థిక భద్రతను అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories