Fake Colgate: క‌లి కాలం కాదు క‌ల్తీ కాలం.. టూత్ పేస్ట్ నుంచి ఈనో వ‌ర‌కు దేనిని వ‌ద‌ల‌డం లేదుగా..

Published : Oct 14, 2025, 11:16 AM IST

Fake Colgate: ఫేమ‌స్ బ్రాండెడ్ దుస్తుల పేర్ల‌ను కాపీ చేస్తూ న‌కిలీ బ్రాండ్‌ల‌ను త‌యారు చేయ‌డం గురించి తెలిసే ఉంటుంది. అయితే మ‌నం ఇంట్లో ఉప‌యోగించే నిత్య‌వ‌స‌ర వ‌స్తువులను కూడా క‌ల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు.  

PREV
15
నకిలీ కొల్గేట్ తయారీ ఫ్యాక్టరీపై దాడి

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో పోలీసులు నకిలీ కొల్గేట్ టూత్‌పేస్ట్ తయారీ చేస్తున్న ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఘటన ఒక్క‌సారిగా యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. మ‌నం నిత్యం ఉప‌యోగించే వ‌స్తువులు కూడా క‌ల్తీ అవుతున్నాయా అన్న ప్ర‌శ్న‌లను లేవ‌నెత్తుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీలో తక్కువ నాణ్యత గల రసాయనాలతో నకిలీ కొల్గేట్ పేస్ట్ తయారు చేసి, అస‌లైందిగా మార్కెట్లో విక్ర‌యిస్తున్నారు. ఈ కేసులో రాజేష్ మక్వానా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

25
నకిలీ ఉత్పత్తులతో ప్రజా ఆరోగ్యానికి ముప్పు

పోలీసులు ఫ్యాక్టరీ నుంచి సుమారు రూ. 9.43 లక్షల విలువైన సరుకులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నకిలీ టూత్‌పేస్ట్ ట్యూబులు, ప్యాకేజింగ్ మెటీరియల్, తయారీ యంత్రాలు ఉన్నాయి. ఈ టూత్‌పేస్ట్‌లో ఉప‌యోగించే న‌కిలీ ప‌దార్థాల్లో విషపూరిత రసాయనాలు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఇవి పళ్లు, జీర్ణ వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

35
గ‌తంలో కూడా..

ఇదిలా ఉంటే ఇలాంటి న‌కిలీ దందా బ‌య‌ట‌ప‌డ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. జూలై 2025లో సూరత్‌లో పోలీసులు నకిలీ మాగీ, ఎవెరెస్ట్ మసాలా తయారీ యూనిట్‌ను పట్టుకున్నారు. ఇదే ఏడాది ఆగ‌స్టులో ఢిల్లీ పోలీసులు పెద్ద స్థాయిలో నకిలీ ఉత్పత్తుల రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఇందులో సెన్సొడైన్ టూత్‌పేస్ట్, ఈనో యాంటాసిడ్, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు వంటి ఉత్పత్తులు కూడా నకిలీగా తయారు చేస్తుండటం బయటపడింది.

45
న‌కిలీ ఉత్ప‌త్తులు విషంతో స‌మానం

ఈ విష‌య‌మై అన్షుల్ స‌క్సేనా అనే వ్య‌క్తి ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. “సెన్సొడైన్, ఈనో, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు నకిలీగా తయారు చేస్తున్న రాకెట్ తాజాగా ఢిల్లీలో బయటపడింది. రోజువారీగా ఉపయోగించే పేస్ట్, మందులు కూడా నకిలీగా తయారవుతున్నాయంటే.. నిజంగా మనం ఎంత సురక్షితంగా ఉన్నామో ఆలోచించండి. ఇవి మోసాలే కాదు, రోజూ మనం తాగుతున్న మెల్లగా పనిచేసే విషాలు.” అంటూ రాసుకొచ్చారు.

55
ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.?

* నకిలీ యాంటాసిడ్స్ వలన కడుపు మంట, అలర్జీ, ఇతర రుగ్మతలు రావచ్చు.

* నకిలీ టూత్‌పేస్ట్ వ‌ల్ల‌ దంతాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.

* నకిలీ సిగరెట్లు వ‌ల్ల‌ ఊపిరితిత్తులు, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

* ఎప్పుడూ అధికారిక డీలర్ల వద్ద నుంచే ఉత్పత్తులు కొనుగోలు చేయాలి.

* ప్యాకేజింగ్, లేబుల్, తయారీ వివరాలు పరిశీలించి నిర్ధారించుకోవాలి.

* అనుమానం వచ్చినప్పుడు వినియోగదారుల ఫిర్యాదు కేంద్రం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.

Read more Photos on
click me!

Recommended Stories